Begin typing your search above and press return to search.
లైవ్: టాప్ లీడర్స్ ఎవరు ముందంజ? ఎవరు వెనుకంజ
By: Tupaki Desk | 2 May 2021 5:21 AM GMTఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రముఖ లీడర్లు కొందరు వెనుకబడడం సంచలనమైంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోటీచేసిన నందిగ్రామ్ నియోజకవర్గంలో వెనుకబడిపోయారు. ఆమెపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి లీడ్ లో ఉండడం విశేషంగా మారింది.
నందిగ్రాంలో 4వ రౌండ్ ముగిసేసరికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏకంగా 8వేల ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఆమెపై సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఇక తమిళనాడులో దిగ్గజాలు లీడ్ లో ఉన్నారు. డీఎంకే అధినేత స్టాలిన్ కొళత్తూరులో ఆధిక్యంలో ఉన్నారు. కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీచేసిన మక్కల్ పార్టీ అధినేత హీరో కమల్ హాసన్ రెండో రౌండ్ లో వెనుకబడ్డారు. వీరే కాదు సీఎం ఫళిని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం సైతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఇక థౌజండ్ లైట్స్ లో పోటీచేసిన ప్రముఖ సీనియర్ నటి ఖుష్బూ వెనుకబడ్డారు. ఆమె బీజేపీ తరుఫున పోటీచేస్తున్నారు. చెపాక్ లో పోటీచేసిన ఉదయనిధి స్టాలిన్ ఆధిక్యంలో ఉన్నారు.