Begin typing your search above and press return to search.

పెళ్లయ్యాక కాదు.. సహజీవనంలోనూ గొడవల గోలనే!

By:  Tupaki Desk   |   4 Nov 2022 12:30 AM GMT
పెళ్లయ్యాక కాదు.. సహజీవనంలోనూ  గొడవల గోలనే!
X
సమాజం మారింది.. ఆధునికత పెరిగింది. పెళ్లికి ముందే అన్నీ కానిచ్చేస్తున్నారు యువతీ యువకులు.. బాగా చదువుకొని ఐటీ జాబ్స్ చేస్తున్న యువతీ యువకులు సహజీవనం పేరుతో ఒక్కటవుతున్నారు. అయితే పెళ్లి వరకూ వీరి సంబంధం రాకముందే గొడవలతో విడిపోతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇందులో మెజార్టీ యువతులే ఉండడం విస్తుగొలిపే విషయంగా మారింది.

ఐటీ సిటీ బెంగళూరులో ఆధునిక జీవనశైలి పెరిగిపోయింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు సహజీవనం పేరిట ఒకే ఫ్లాట్ లో ఉంటూ కలిసి జీవిస్తున్నారు. అయితే పెళ్లిళ్ల వరకూ వచ్చేసరికి మొహం మొత్తి గొడవలతో విడిపోతున్నారు. అమ్మానాన్నల సంబంధం కోసం ఇప్పుడీ తాత్కాలిక బంధాన్ని కాలదన్నుతున్నారు. ఇక సహజీవనంలో వేధిస్తున్నారని పోలీసుల గడప తొక్కుతున్నారు.

ఐటీ సిటీ బెంగళూరులో సహజీవనంతో అమాయక యువతులు, మహిళలు వంచనకు గురి అవుతున్న కేసులు ఎక్కువవుతున్నాయి. మోసపోయామంటూ రాష్ట్ర మహిళా కమిషన్ లో ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయి. అత్యాచారం, కుటుంబ దౌర్జన్యాలు, వరకట్న వేధింపులు, వివాహం చేసుకుంటామని నమ్మించి వంచనకు పాల్పడుతున్నట్టు బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు.

విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పెళ్లికాకుండానే ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేయడం బెంగళూరులో ఎప్పటి నుంచో ఉన్న ధోరణి. దీనిపై గతంలోనూ అనేక చర్చలు జరిగాయి. కానీ ఈ పాశ్చాత్య పెడధోరణి కొనసాగుతూనే ఉంది. కొత్తగా ఇప్పుడు గొడవలు పెరిగాయి. సహజీవనం చేపట్టి ఏడాది గడిచేలోపు గొడవలు పడి ఆడపిల్లలు న్యాయం చేయాలని మహిళా కమిషన్ కు మొర పెట్టుకుంటున్నారు.

ముఖ్యంగా వల వేసి కొందరు ఆడపిల్లలతో సహజీవనం చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. మోసపోయి న్యాయం కోసం ఆశ్రయించే బదులు మోసపోయి జాగ్రత్త వహించాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

ప్రస్తుతం బెంగళూరులో నెలకు సుమారు 8 నుంచి 10 లివింగ్ టు గెదర్ గొడవల కేసులు వస్తున్నాయి. ఏడాది కాలంగా ఫిర్యాదులు రెట్టింపు అయినట్టు చెబుతున్నారు. దీనివల్ల యువతులే ఎక్కువగా నష్టపోతున్నారు. వారిని తల్లిదండ్రులు జాగృతం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.