Begin typing your search above and press return to search.
తన ఓటు తాను వేసుకోని బాలిక.. ఇప్పుడు కాబోయే దేశ ప్రధానా?
By: Tupaki Desk | 5 Aug 2022 12:30 AM GMTకాలానికి మించిన సిత్రం మరెందులోనూ కనిపించదు. జీరోను హీరో చేయటం.. హీరోను జీరోను చేయటంలో కాలానికి మాత్రమే సాధ్యం. దాదాపు నలభై ఏళ్ల క్రితం బ్రిటన్ లోని ఒక స్కూల్లో నిర్వహించిన నాటికలో ఉత్తుత్తి ఎన్నికలు నిర్వహించారు. అందులో భాగంగా అభ్యర్థులు ప్రసంగించాలి. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారు. విచిత్రమైన విషయం ఏమంటే.. ఆ బాలిక తన ఓటు తనకు వేసుకోలేదు. ఆమెకు ఒక్క ఓటు కూడా పడలేదు. కాలచక్రంలో నలభై ఏళ్లు గడిచిపోయాయి. అప్పటి బాలిక ఇప్పుడు శక్తివంతమైన దేశ ప్రధాని అభ్యర్థిని అయ్యింది. నాటి ఉత్తుత్తి ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా పొందని ఆమె.. ఇప్పుడు ఆమెను దేశ ప్రధానిగా ఎంపిక చేసే ఎన్నికల్లో ఆమెకే ఓటు వేస్తానని అంటున్నారు. ఇలాంటి విచిత్రమైన గతంతో వర్తమానంలో తిరుగులేని బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టే అరుదైన అవకాశం ఎక్కువగా ఉన్న అభ్యర్థినిగా నిలిచారు లిజ్ ట్రస్.
బ్రిటన్ ప్రధానిగా ఉన్న బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన వారసుడిగా పేరు వినిపించింది భారతీయ మూలాలు ఉన్న రుషి సునాక్. అయితే.. ఆయన ఎన్నికల్లో వెనుకబడుతున్నారు. ఆయనకు పోటీగా నిలిచిన లిజ్ ట్రస్ .. తిరుగులేని అధిక్యతతో దూసుకెళ్లటమే కాదు.. ఆమె అధిక్యతను రుషి అంగీకరించటమే కాదు.. తాను వెనుకబడిన విషయాన్ని చెప్పటం గమనార్హం. పోటీ ముగింపు దశకు వచ్చే నాటికి పరిస్థితులు ఆమెకు అనుకూలంగా మారతాయని చెబుతున్నారు. బ్రిటన్ భావి ప్రధానిగా లిజ్ ట్రస్ కే ఎక్కువగా ఉన్నట్లుగా చెప్పక తప్పదు. ఒక విధంగా చెప్పాలంటే.. ఆమె ఎన్నిక అన్నది లాంఛనమేనని చెప్పాలి. ఏదో అద్భుతం జరిగితే తప్పించి.. ఆమెను ప్రధాని కాకుండా ఆగే అవకాశం లేదని చెప్పాలి.
ఇంతకీ ఎవరీ లిజ్ ట్రస్.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే.. 1975లో ఆక్స్ ఫర్డ్ లోని వామపక్ష భావజాలం కుటుంబంలో జన్మించారు లిజ్ ట్రస్. తండ్రి మ్యాథ్స్ ప్రొఫెసర్ కాగా.. తల్లి నర్స్. రౌండేలో స్కూలింగ్ పూర్తి చేసి.. ఆక్స్ ఫర్డ్ లో చేరారు. అక్కడ ఫిలాసఫీ.. పాలిటిక్స్.. ఎకనామిక్స్ లో ఉన్నత చదువులు చదివారు. స్టూడెంట్ గా ఉన్న వేళలో లిబరల్ డెమోక్రాట్ల తరఫు పాల్గొన్న ఆమె కొన్నాళ్లకే కన్జర్వేటివ్ పార్టీకి మారారు. డిగ్రీ పూర్తి చేశాక అకౌంటెంట్ గా పని చేసిన ఆమె హ్యూవో లియారీని పెళ్లాడారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం.
2001లో కన్జర్వేటివ్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తర్వాత 2005 ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు. తొలిసారి గ్రీన్ విచ్ నుంచి కౌన్సిలర్ గా విజయం సాధించారు. 2010లో జరిగిన ఎన్నికలకు ఆమెను అభ్యర్థిగా ఎంపిక చేశారు పార్టీ నేత డేవిడ్ కేమరూన్. నార్ ఫోక్ నుంచి పోటీ చేసిన ఆమె గెలుపొందారు. 2012లో ఆమె వ్యక్తిగత జీవితం మీద విమర్శలు రావటంతో ఆమెను పదవి నుంచి తప్పించాలని చూశారు. కానీ.. సాధ్యం కాలేదు. అదే ఏడాది విద్యా మంత్రిగా నియమితులయ్యారు.
ఆమె రాజకీయ జీవితంలో అతి కీలకమైన నిర్ణయాల్లో ఒకటి బ్రెగ్జిట్ ను తీవ్రంగా వ్యతిరేకించటం. ఈయూ నుంచి విడిపోవటాన్ని అతి పెద్ద విషాదంగా పేర్కొంటూ ఆమె ఒక ఎడిటోరియల్ రాశారు. బ్రెగ్జిట్ తో వ్యాపారాల్లో మరింత జాప్యం చోటు చేసుకుంటుందన్నది ఆమె వాదన. అయితే.. బ్రెగ్జిట్ కు బ్రిటన్ లో ఆమోద ముద్ర పడిన నేపథ్యంలో ఆమె తన మనసును మార్చుకున్నారు. 2016లో జస్టిస్ సెక్రటరీగా బాధ్యతల్ని చేపట్టిన ఆమె.. 2019లో బోరిస్ జాన్సన్ ప్రధాని అయ్యాక అంతర్జాతీయ ట్రేడ్ సెక్రటరీగా బాధ్యతల్ని చేపట్టారు. 2021లో బ్రిటన్ విదేశాంగ శాఖ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి చేపట్టిన వేళ.. మాస్కోకు వ్యతిరేకంగా బ్రిటన్ తరఫున ఆమె గళాన్ని వినిపించారు.
బోరిస్ ప్రధానిగా పదవి నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించటంతో ఆమె పేరు తెర మీదకు వచ్చింది. రుషి సునక్ పై జాన్సన్ గుర్రుగా ఉండటంతో తెర వెనుక ట్రస్ కు మద్దతు ఇచ్చారు. దీంతో ఆమె రేసులో ముందుకు వచ్చారు. బ్రిటన్ ఉక్కు మహిళగా పేరున్న మాజీ ప్రధాని మార్గరేట్ థాచర్ మాదిరి కనిపించేలా వస్త్రధారణలో జాగ్రత్తలతో పాటు.. పార్టీలో మద్దతు కోసం శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. రుషితో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో థాచర్ శైలిని ప్రదర్శించిన ఆమె తీరును బ్రిటన్ మీడియా సైతం గుర్తించింది.
1980లలో మార్గరేట్ థాచర్ వ్యక్తిగత ఆదాయ పన్ను తగ్గిస్తామని చెప్పినట్లే.. తాజాగా పెరుగుతున్న ధరల్ని ప్రజలు తట్టుకునేలా చేయటం కోసం ఆమె.. 9 బిలియన్ పౌండ్ల పన్ను రాయితీలను ఇస్తాననే హామీని ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. ఏమైనా ఓటములతో రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టి.. తిరుగులేని ప్రధాని పదవికి అడుగు దూరంలో ఉన్న ఆమె.. త్వరలో ఆ పదవిని చేపట్టే అవకాశమే ఎక్కువన్న మాట వినిపిస్తోంది.