Begin typing your search above and press return to search.

మోదీ వెర్స‌స్ అద్వానీ : కోల్డ్ వార్

By:  Tupaki Desk   |   14 Aug 2015 3:29 PM GMT
మోదీ వెర్స‌స్ అద్వానీ : కోల్డ్ వార్
X
అదృష్టం ఉండి మోడీ ప్ర‌ధాని అయిపోయాడు గానీ.. ఈ దేశానికి ప్ర‌ధాని కావాల్సిన వాడు అద్వానీ. కురువృద్ధుడిగా పేరున్న అద్వానీని కాద‌ని అనూహ్యంగా మోడీ పేరు తెర‌పైకి రావ‌డంతో.. పాపం బీజేపీలో చాలా మందికి ఈ ప‌రిణామం మింగుడుప‌డ‌లేదు. కానీ ఏం చేస్తారు. ఒక్క‌డు.. ఒక్క‌డున్నాడు.. ఒక్క‌డు చాలు.. ఒకే ఒక్క‌డు సినిమాల త‌ర‌హాలో మోడీ తెర‌పైకి దూసుకువ‌చ్చి పీఎం ప‌గ్గాలు అందుకున్నాడు. ఆయ‌న‌ప్ప‌టికీ అద్వానీ త‌న‌ని తాను నియంత్రించుకున్నాడు. కానీ ఆపద‌ సమ‌యంలో క‌నీస ధ‌ర్మం పాటించ‌క అద్వానీ వ‌ర్గానికి చెందిన మ‌హిళానేత సుష్మ పుట్టెడు క‌ష్టాల్లో ఉంటే గుప్పెడు గుండెకు ధైర్యం చెప్ప‌క చూసీ చూడ‌నట్లు అలానే ఉండిపోతున్నాడు న‌రేంద్రుడు.

రేప‌టివేళ సుష్మాపై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు ఏవైనా కానీయండి అవి నిరూప‌ణ‌కు నోచుకుంటే ఆమెను ప‌ద‌వీచిత్యురాలు చేయ‌డం ఖాయం. రెండు రోజుల క్రితం సుష్మ త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై ఏక‌ధాటిగా వివ‌ర‌ణ ఇస్తుంటే.. పాపం పెద్దాయ‌న క‌న్నీళ్ల‌ ప‌ర్యంత‌మ‌య్యాడు. వివాద‌స్ప‌ద వ్యాపారవేత్త లలిత్ మోడీకి సాయం చేశారంటూ విప‌క్షాలు చేసిన ఏక‌ప‌క్ష దాడిని సుష్మా తిప్పికొట్టిన తీరు బీజేపీ అగ్రనేతను ఆకట్టుకుంది. ఐతే.. ఇదే స‌మ‌యంలో మోడీ వెర్స‌స్ అద్వానీ అన్న‌ట్లుగా ప‌రిణామాలు చ‌క‌చ‌కా మారిపోతున్నాయ్‌. ఇప్ప‌టికే మోడీ టీం అద్వానీకి చుక్క‌లు చూపిస్తే.. పాపం పెద్దాయ‌న మాత్రం ఎదురు దాడికి దిగ‌లేక‌, పార్టీ నిర్ణ‌యాల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడ లేక ష‌ర‌తుల‌తో కూడిన నిశ్శ‌బ్దం పాటిస్తున్నాడు.

ఎప్పుడో ఓ సారి.. దేశంలో మ‌ళ్లీ చీక‌టి రోజులు వ‌స్తాయంటూ మోడీ పాల‌న‌ను ఉద్దేశిస్తూ.. సంచ‌ల‌న వ్యాఖ్యలు చేయ‌డం త‌ప్ప‌! అద్వానీ చేయ‌గ‌లిగిందేమీ లేదు. సుష్మా.. వ‌సుంధ‌ర రాజే ఇలా ఇవాళ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నేత‌లెవ‌రైనా కావ‌చ్చు వారిని పార్టీ ర‌క్షించేందుకు పూనుకోవ‌డం లేదు స‌రికదా! క‌నీసం పార్ల‌మెంట్ వేదిక‌గానైనా విప‌క్షాల‌ను క‌ట్ట‌డి చేసేందుకు చొర‌వ చూప‌క పోవ‌డం క‌మ‌లం పార్టీలో వ‌చ్చిన పెను మార్పున‌కు సంకేతం. మోడీ త‌న వారు కాద‌నుకున్నందువ‌ల్లే సుష్మాకు ఇంత‌టి క‌ష్టం వ‌చ్చింద‌ని అద్వానీ అనుకోవ‌డం..అనుకుని ఊరుకోవ‌డం త‌ప్ప‌! ఇవాళ కురువృద్ధుడు తిరుగుబావుటా ఎగుర వేసే ఛాన్సే లేదు. ఐతే.. ఈ ముస‌లం ఎన్న‌టికైనా ప్ర‌మాద‌మే!