Begin typing your search above and press return to search.
రాష్ట్రపతిగా అద్వానీ బెటర్ అంటున్న బీజేపీ నేత
By: Tupaki Desk | 15 Jun 2017 11:51 AM GMTరాష్ట్రపతి రేసులో అనూహ్యంగా బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఆయన పేరును ప్రతిపాదించింది పార్టీ కాదు. బీజేపీ సీనియర్ నేత - నటుడు శత్రుఘ్నుసిన్హా. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు పార్టీ సీనియర్లైన కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ - రాజ్ నాథ్ సింగ్ - వెంకయ్యనాయుడులతో కూడిన కమిటీని వేసిన విషయం తెలిసిందే. తమ అభ్యర్థిపై చర్చించడానికి ఈ కమిటీ శుక్రవారం ప్రధానప్రతిపక్ష నేత సోనియాగాంధీ - వామపక్ష నాయకుడు సీతారం ఏచూరిలను కలవనుంది. ఇలా పార్టీ పరంగా ప్రయత్నాలు కొనసాగుతున్న సమయంలో సిన్హా తనదైన శైలిలో అద్వానీని తెరమీదకు తెచ్చారు.
రాష్ట్రపతి పదవికి ఎల్‌కే అద్వానీ పేరును ప్రతిపాదిస్తూ, ఆయనకు మద్దతుగా నిన్నటి నుంచి సిన్హా వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఆయన అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలని నెటిజన్లను కోరారు. తనకున్న అనుభవంతో అద్వానీ రాజ్యాంగంలోని సంక్లిష్టతను సరిగా అర్థం చేసుకోగలరని, ఎవరి సలహాలు లేకుండా దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సొంతంగా నిర్ణయాలు తీసుకునే సత్తా ఆయనకు ఉందని శత్రుఘ్ను సిన్హా ట్వీట్ చేశారు. 2013లో ప్రధాని అభ్యర్థిత్వానికి నరేంద్ర మోడీ పేరును వ్యతిరేకించిన బీజేపీ నేతల్లో శత్రుఘ్ను సిన్హా కూడా ఒకరు. ఇప్పుడాయనే మోడీ పక్కన పెట్టిన అద్వానీ పేరును రాష్ట్రపతి పదవికి సూచించడం గమనార్హం. అటు బీజేపీ, ఇటు ప్రతిపక్షాలు తమ అభ్యర్థిపై మల్లగుల్లాలు పడుతున్న సమయంలో సిన్హా.. అనూహ్యంగా అద్వానీ పేరును తెరపైకి తీసుకురావడం విశేషం.
విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ - లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, సామాజిక న్యాయశాఖ మంత్రి తేవర్ చంద్ గెహ్లాట్ లలో ఒకరిని బీజేపీ ఎంపిక చేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము పేరు కూడా బీజేపీ పరిశీలనలో ఉంది. తమ అభ్యర్థిపై ఎన్డీయే ప్రభుత్వం మిత్ర, ప్రతిపక్షాలను ఒప్పించగలిగితే.. రాష్ట్రపతి ఎన్నిక అవసరం ఉండదు. అటు బీజేపీ, ఇటు ప్రతిపక్షాలు తమ అభ్యర్థిపై మల్లగుల్లాలు పడుతున్న సమయంలో సిన్హా.. అనూహ్యంగా అద్వానీ పేరును తెరపైకి తీసుకురావడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/