Begin typing your search above and press return to search.

అద్వానీ రికార్డు బద్దలు కొడుతాడా?

By:  Tupaki Desk   |   11 March 2019 11:46 AM GMT
అద్వానీ రికార్డు బద్దలు కొడుతాడా?
X
రాజకీయాల్లోనే కురువృద్దుడు.. బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నారు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఆయన గుజరాత్ రాష్ట్రంలోని గాంధీ నగర్ నుంచి ఎంపీగా పోటీచేయబోతున్నారు. దేశంలో ఈ లోక్ సభ ఎన్నికల్లోనే పోటీచేస్తున్న అభ్యర్థుల్లో ఎల్కే అద్వానీ అత్యంత ఎక్కువ వయసు ఉన్న రాజకీయనేత కావడం విశేషం.

ప్రస్తుతం అద్వానీ వయసు 91.. ప్రస్తుతం దేశంలో లోక్ సభకు పోటీపడుతున్న అభ్యర్థుల్లో ఈయనే సీనియర్. ఒకవేళ గెలిస్తే 2024 వరకు ఈయన ప్రాతినిధ్యం వహిస్తారు. అప్పుడు అద్వానీ వయసు 96 సంవత్సరాలకు చేరుకుంటుంది. ఇది రాజకీయాల్లో ఓ రికార్డుగా చెబుతున్నారు. ఇప్పటివరకు రాజకీయాల్లో ఎంపీగా కొనసాగుతూ అత్యధిక వయసున్న వ్యక్తిగా జనతాదల్ యూ నేత రాము సుందర్ దాస్ పేరిట రికార్డు ఉంది. ఆయన వయసు 93ఏళ్లు. కానీ అద్వానీ గనుక ఈ ఎన్నికల్లో గెలిస్తే రాము సుందర్ దాస్ రికార్డును బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

అద్వానీని ఈసారి గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ నుంచి పోటీచేయించాలని బీజేపీ అధిష్టానం పట్టుదలతో ఉంది. అయితే దీనికి కారణం లేకపోలేదు. గడిచిన సారి బీజేపీలో 75 ఏళ్లు దాటిన వారిని ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంచారు. ఇది చాలా వివాదాస్పదమై మోడీ-షా ద్వయానికి చిక్కులు తెచ్చిపెట్టింది. వీరిది పార్టీలో నిరంకుశ వైఖరని బీజేసీ సీనియర్లు సైతం విమర్శలు గుప్పించారు. దీనికి తోడు ఈసారి బీజేపీకి దేశంలో గడ్డు పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ మరోసారి తమ కురువృద్దులైన అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శాంతకుమార్ మరియు యడ్యూరప్పలను పోటీచేయించి ఆ మచ్చను చెరిపేసుకోవాలని నిర్ణయించింది.

తాజాగా యూపీకి చెందిన బీజేపీ సీనియర్ అయిన కల్ రాజ్ మిశ్రా ఈసారి ఎన్నికల్లో పోటీచేయాలని సీనియర్ నేత అద్వానీని కోరారు. ఒక వేళ అద్వానీ ఒప్పుకుంటే ఈ పార్లమెంట్ చరిత్రలోనే అత్యధిక వయసున్న ఎంపీగా అద్వానీ రికార్డు సృష్టిస్తారు. ఒకవేళ అద్వానీ ఈ ఐదేళ్లు ఆరోగ్యంగా, క్రియాశీలంగా ఉంటే దేశంలోనే అతి ఎక్కువ వయసున్న ఎంపీగానూ వచ్చే 5 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టిస్తారు.. చూడాలి మరి ఏం జరుగుతుతోందో..