Begin typing your search above and press return to search.

భార్య ఫొటోలు పోర్న్ యాప్ లో పెడుతామని బెదిరింపులు.. ఫైర్ మెన్ ఆత్మహత్య

By:  Tupaki Desk   |   21 July 2022 12:30 AM GMT
భార్య ఫొటోలు పోర్న్ యాప్ లో పెడుతామని బెదిరింపులు.. ఫైర్ మెన్ ఆత్మహత్య
X
రోజురోజుకు లోన్ యాప్ ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. కొందరు చనిపోతున్నా.. బాధితుల సంఖ్య పెరిగిపోతున్నా లోన్ యాప్ ల తీరు మాత్రం మారడం లేదు.ఇటీవల సైబరాబాద్ సైబర్ క్రైమ్ పరిధిలో ఒక్కరోజే 33 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ పరిధిలో 39 కేసులు నమోదయ్యాయి. రాచకొండ పరిధిలో 30 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజే ఏకంగా 100కు పైగా కేసులు నమోదయ్యాయి..

వివిధ యాప్ లు, కంపెనీలు.. తమ వద్ద డబ్బులు తీసుకున్న కస్టమర్లను నానా బూతులు తిడుతూ ఫోన్ లో బెదిరిస్తున్నారని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంట్లోని మహిళలకు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో రుణాల ప్రతినిధులు మాట్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ లోని కాంటాక్టులను ట్రేస్ చేసి అందరికీ మెసేజ్ లు పంపి పరువు తీస్తున్నారని ఫిర్యాదు చేశారు.

ఆన్ లైన్ లోన్ యాప్ వేధింపులు వాటి వల్ల జరుగుతున్న ఆత్మహత్య ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి లోన్ యాప్ యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడు. ఇతడు ఫైర్ మేన్ సుధాకర్ గా పోలీసులు గుర్తించారు.

సుధాకర్ అనే వ్యక్తి ఆత్మహత్య విషాదం నింపింది. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. రాజేంద్ర నగర్ లోని శాస్త్రిపురంలో రైలు కింద పడి ఇతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గోల్డెన్ రూపీ యాప్ లో రూ.6వేలను సుధాకర్ అప్పు రూపంలో తీసుకున్నాడు. అయితే తీసుకున్న అప్పును సకాలంలో చెల్లించలేకపోయాడు. దీంతో కొంతకాలంగా లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు ఎక్కువయ్యాయి. మరో అడుగు ముందుకేసి.. భార్య ఫొటోలు పోర్న్ యాప్ లో పెడుతామని బెదిరించారు.

అందులో భాగంగానే సుధాకర్ బంధువులు, స్నేహితులకు అసభ్యకర రీతిలో బాధితుడి పేరుపైన మెసేజ్ లు పంపారు. బాధితుడు చేసేది లేక బాధితుడు సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తన అన్నయ్యకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా చెప్పాడు.