Begin typing your search above and press return to search.
మారటోరియం-3: పొడిగించే యోచనలో ఆర్బీఐ
By: Tupaki Desk | 23 July 2020 4:30 PM GMTవైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ వలన ప్రజల ఆదాయ మార్గం తగ్గింది. ఈ క్రమంలో ప్రజలు ఈఎంఐలు చెల్లించలేరని భావించి ప్రభుత్వం ఈఎంఐల చెల్లింపు వాయిదా వేస్తూ మారటోరియం విధించింది. మొదట మూడు నెలలు.. అనంతరం మరో మూడు నెలలు మారటోరియం విధించిన విషయం తెలిసిందే. ఈఎంఐలు చెల్లించనవసరం లేదని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. ఇప్పుడు తాజాగా మరోసారి మారటోరియం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వాస్తవంగా రెండో మారటోరియం ఆగస్టు 31తో ముగియనుంది. అయితే ప్రస్తుతం ఇంకా ఆర్థిక పరిస్థితులు చక్కబడలేదు. ప్రజల ఆదాయం మార్గాలు పెరగలేదు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ మరోసారి మారటోరియం మూడు నెలల పాటు పొడిగించే అవకాశం ఉంది. ఈ మేరకు చర్చ నడుస్తోందని సమాచారం. అయితే ఈసారి మారటోరియం కొన్ని రంగాలకు మాత్రమే విధించేలా అధికారులు సమాలోచనలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంకా కోలుకోని రంగాలకు ఈ మారటోరియం విధించేలా పరిణామాలు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా విమానయానం.. ఆటోమొబైల్స్.. పర్యాటక.. హాస్పిటాలిటీ.. తదితర రంగాలకు మారటోరియం విధించేలా ఆర్బీఐ యోచిస్తోంది. లాక్ డౌన్ తర్వాత అన్ లాక్ మొదలైనా ఈ రంగాలు ఇంకా కోలుకోలేకపోవడంతో ఈ రంగాలకు మారటోరియం విధించేలా ఆర్బీఐ త్వరలో నిర్ణయం తీసుకోనుందని సమాచారం.