Begin typing your search above and press return to search.
ఇపుడు పవన్, జగన్ తేల్చుకోవాల్సిందే
By: Tupaki Desk | 17 Sep 2016 11:30 AM GMTసార్వత్రిక ఎన్నికలు జరిగిన రెండున్నరేళ్ల తర్వాత ఏపీలో జరుగుతున్న ప్రత్యక్ష ఎన్నికలు ఆ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పనున్నాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ మరో పార్టీతో జట్టు కడుతుందనే విషయమై జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ వాతావరణంలో మిత్రపక్షాలైన తెలుగుదేశంపార్టీ - భారతీయ జనతా పార్టీలు తిరిగి పొత్తులతో పోటీ చేయక తప్పదు. మరి - విపక్షాలైన వైసీపీ - కాంగ్రెస్ - వామపక్షాలతో పాటు కొత్తగా ఆవిర్భవించిన జనసేన పార్టీల మధ్య పొత్తుల విషయంపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష నేతగా జగన్ ఎవరిని కలుపుకొనిపోతారు, కొత్త ఆశాకిరణంగా ఉన్న పవన్ ఏ విధంగా ముందుకు సాగుతాడనే దానిపైనే పురపాలక ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు.
ఈ ఏడాది చివరలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 11 పురపాలక సంఘాలు - కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాలి. ఎన్నికలు జరిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా న్యాయస్ధానం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం కూడా ఎన్నికల నిర్వహణ దిశగా చర్యలు మొదలుపెట్టింది. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం - కోస్తాలో గుంటూరు - ఒంగోలు - కాకినాడ - రాయలసీమలో కర్నూలు - తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. అదే విధంగా శ్రీకాకుళం - విజయనగరం - కడప జిల్లాల్లోని నాలుగు పురపాలికలకు ఎన్నికలు నిర్వహించాలి. వీటన్నింటిలో ఓటర్ల జాబితా సవరణలు చేసి ఓటర్ల జాబితాకు తుదిరూపు ఇవ్వాల్సిందిగా న్యాయస్ధానం ఆదేశాలు గతంలోనే ఇచ్చింది. సదరు ఆదేశాలకు అనుగుణంగానే ప్రభుత్వం కూడా ఓటర్ల జాబితాకు తుదిరూపు ఇచ్చే దిశగా కసరత్తు చేస్తోంది.
ఈ నేపధ్యంలోనే రాష్ట్రానికి ప్రత్యేకహోదా అంశం వివాదాల్లో చిక్కుకుంది. అధికార తెలుగుదేశం పార్టీ ఒకసారి రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్సిందేని, మరోసారి ప్రత్యేక ప్యాకేజి ఇచ్చినా సరేనంటూ తన చిత్తానికి వచ్చినట్లు ప్రకటనలు చేస్తోంది. విపక్షాలు మాత్రం రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఇదే విషయమై వైసీపీ ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో ఆందోళనలు కూడా జరిగాయి. ఈ మధ్య వైసీపీతో కలిసి కాంగ్రెస్ - వామపక్షాలు కూడా ఆందోళనల్లో పాల్గొంటున్నది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధ్యం కాదని, ప్రత్యేకసాయం చేస్తామంటూ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. తెరవెనుక కారణాలేమైనా టిడిపి జాతీయ అధ్యక్షుడు - ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ప్యాకేజికే జై కొట్టారు. దాంతో విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి రాష్ట్ర బంద్ కు పిలుపివ్వటం ద్వారా తమ నిరసనను తెలిపాయి. మధ్యలో జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవలే కాకినాడలో బహిరంగసభ నిర్వహించి రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ హూంకరించటం గమనార్హం.
'ప్రత్యేక' అంశంపై అధికార-ప్రతిపక్షాల మధ్య ఇంత స్పష్టమైన విభజన వచ్చిన నేపథ్యంలో త్వరలో జరుగుతాయనుకుంటున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ ఎవరితో జట్టు కడుతుందనే విషయమై చర్చ జోరందుకున్నది. విపక్షాల్లోని ప్రతీ పార్టీకి ఎవరి అజెండా వారికున్నప్పటికీ ప్రత్యేకహోదా అంశంలో మాత్రమే కలుస్తున్నాయి. ఇక, మిత్రపక్షాల్లోని తెలుగుదేశంపార్టీ-భారతీయ జనతా పార్టీలు అధికారాన్ని కలిసి పంచుకుంటున్నాయన్న మాటేగానీ రెండు పార్టీల మధ్య చాలా అంశాల్లో వ్యవహారం ఉప్పు-నిప్పుగానే సాగుతోంది. మిత్రపక్షాల మధ్య సంబంధాలు ఎప్పుడు తెగిపోతాయో అన్నట్లుగానే వ్యవహారం గడచిన రెండేళ్ళ నుండి సాగుతూనే ఉంది. ఈ పరిస్దితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య ఏ మేరకు పొత్తు సాఫీగా సాగుతుందో అనుమానమే. రెండు పార్టీల మధ్య జాతీయ స్ధాయిలోను - రాష్ట్ర స్ధాయిలోనూ కొందరు నేతల మధ్య సంబంధాలు సఖ్యతతోనే ఉన్నప్పటికీ నియోజకవర్గ స్ధాయిలో మాత్ర సంబంధాలు ఏమాత్రం బాగోలేవన్న విషయం బహిరంగ రహస్యమే. అధికారంలో ఉన్న మిత్రపక్షాల మధ్యే పరిస్దితులు ఈ విధంగా ఉంటే, ప్రతిపక్షంలోని పార్టీల మధ్య సయోధ్య ఏ విధంగా ఉంటుందో ఊహించు కోవచ్చు.
అయితే, కారణాలేవైనా గానీ కొన్ని సందర్భాల్లో అధికార తెలుగు దేశంపార్టీ చేసిన కొన్ని తప్పుల వల్ల ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ బలం పుంజుకున్నట్లే కనబడుతోంది. ప్రత్యేకించి ప్రజల మనోభావాల్లో సెంటిమెంట్ గా నిలిచిపోయిన ప్రత్యేకహోదా అంశంపై అధికార టీడీనీ వేసిన పిల్లిమొగ్గలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళింది. దానితో పాటు విభజన చట్టం ప్రకారం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు విఫలమయ్యారని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఓటుకునోటు కేసులో ఇరుక్కోవటం - రాజధాని నిర్మాణ ప్రక్రియలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని పదే పదే ముఖ్యమంత్రిపై వైసీపీ ప్రజల్లో ప్రచారం చేస్తోంది. ఈ విషయాలను గనుక ప్రజలు నమ్మితే టిడిపికి రానున్న ఎన్నిక ల్లో ఇబ్బందులు తప్పవు.వైసీపీని మినహా ఇస్తే మిగిలిన కాంగ్రెస్ - వామపక్షాల ప్రభావం నామమాత్రమేనని అనుకుంటున్నారు. ఈ దశలో ఈ మూడు పార్టీలు వైసీపీతో పొత్తు పెట్టుకోవాలంటే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది తీసుకోక తప్పదు.
ఇదిలావుండగా, ఇటీవలే ఆవిర్భవించిన జనసేనపై ప్రజల్లో ఏమాత్రం అంచనాలున్నాయో ఇంకా స్పష్టత రాలేదు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందా లేదా అన్న విషయం కూడా ఎవరికీ తెలీదు. ఎందుకంటే, ఆ పార్టీకి సర్వం సహా పవన్ కల్యాణ్ మాత్రమే. ఆ పార్టీకి ఇప్పటివరకు కార్యవర్గం లేదు - కార్యకర్తలు లేరు. క్రిందస్ధాయి నుండి పై వరకూ కేవలం పవన్ ఒక్కరే కనబడుతారు. మిగిలిన విపక్షాలతో పవన్ కలుస్తారా లేకపోతే ఒంటరిగానే పోటీ చేస్తారా లేక అసలు పోటీ చేసే ఉద్దేశ్యంలోనే లేరా అన్నది తెలీదు. ఏదేమైనా మిత్రపక్షాలకు వ్యతిరేకంగా వైసీపీ - వామపక్షాలు కలిసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువుగా ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన వల్ల ప్రజలకైన గాయం ఇంకా మానలేదని, కాబట్టి కాంగ్రెస్ కు దూరంగా ఉండటమే మంచిదని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది.
అయితే, ప్రత్యేకహోదా కోసం ఇటీవలి కాలంలో కాంగ్రెస్ చేస్తున్న పోరాటాన్ని ఎవరూ తక్కువగా చూడటం లేదు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిపోరాటం చేసినా రాబట్టుకునే ఓట్లపైనే భవిష్యత్తు పొత్తులు ఆధారపడి ఉంటాయనటంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఎందుకంటే, రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ ప్రజలకు తీరని గాయం చేసిందని అనుకుంటున్న నేపధ్యంలో ఎన్నికల తరువాత టిడిపి-భాజపాలు కూడా అంతకన్నా తక్కువేమీ చేయలేదని కూడా ప్రజలు అనుకుంటున్నట్లు ప్రచారంలో ఉంది. దాంతో ప్రస్తుత గాయానికి మిత్రపక్షాలే కారణమన్న కసి ప్రజల్లో ఉంటే కాంగ్రెస్ పై ప్రజల కోపం కొంత తగ్గే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా, ఇప్పటికైతే టిడిపి - భాజపాలు ఒకవైపు, వైసీపీ - వామపక్షాలు ఇంకోవైపు - కాంగ్రెస్ మరోవైపు ఉండటం ఖాయంగా తెలుస్తోంది. కాకపోతే మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలపైనే రాష్ట్రంలోని రాజకీయ పార్టీల మధ్య భవిష్యత్తు పొత్తులు ఆధారపడివుంటాయన్నది వాస్తవం.