Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ లో క‌ల‌క‌లం..మ‌రో నేత దారుణ హ‌త్య‌

By:  Tupaki Desk   |   13 Feb 2018 9:01 AM GMT
కాంగ్రెస్‌ లో క‌ల‌క‌లం..మ‌రో నేత దారుణ హ‌త్య‌
X
కొద్దివారాల క్రితమే మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య నల్గొండను కుదిపేసిన సంగ‌తి తెలిసిందే. ఈ హ‌త్య గురించి అధికార‌, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య తీవ్ర‌వాగ్యుద్ధం జ‌రుగుతోంది. నల్గొండలో కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యపై ఓ వైపు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగానే… ఆ జిల్లాలో మరో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.

తిరుమలగిరి మండలం నాగార్జునపేట తండాలో కాంగ్రెస్ నేత - గ్రామ ఉప సర్పంచ్ ధర్మా నాయక్‌ ను దారుణంగా హత్య చేశారు. ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో మంచంకింద బాంబులు పెట్టి పేల్చేశారు ప్రత్యర్థులు. దీంతో ధర్మానాయక్ శరీరం ముక్కలైపోయింది. పాతకక్షలతోనే ధర్మానాయక్ హత్య జరిగినట్టుగా తెలుస్తోంది. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. తాజాగా మరో కాంగ్రెస్ నేత హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది. కాగా, ఈ హ‌త్య‌పై ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ మండిప‌డుతోంది. రాష్ట్రంలో భ‌ద్ర‌త‌లేని ప‌రిస్థితి నెల‌కొంద‌ని దీనికి అధికార పార్టీ బాధ్య‌త వ‌హించాల‌ని డిమాండ్ చేస్తోంది.