Begin typing your search above and press return to search.

స్థానిక ఎన్నిక‌లు.. ఏపీలో సంద‌డైన రాజ‌కీయం!

By:  Tupaki Desk   |   13 Jan 2020 6:40 AM GMT
స్థానిక ఎన్నిక‌లు.. ఏపీలో సంద‌డైన రాజ‌కీయం!
X
ఒక‌వైపు తెలుగుదేశం పార్టీ అమ‌రావ‌తి ఆందోళ‌న‌లు అంటూ హ‌డావుడి చేస్తూ ఉంది. మిగ‌తా రాష్ట్రం ఏమై పోయినా ఫ‌ర్వాలేదు అమ‌రావ‌తి నుంచినే అంతా జ‌ర‌గాలంటూ తెలుగుదేశం పార్టీ ర‌చ్చ చేస్తూ ఉంది. స్వ‌యంగా తెలుగుదేశం పార్టీ అధినేత పార్టీ శ్రేణుల‌ను అమ‌రావ‌తి మీద ఆందోళ‌న‌లు చేయాల‌ని ఒత్తిడి చేస్తున్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. మిగ‌తా ప్రాంతాల రాజ‌కీయ నేత‌లు కూడా త‌మ ప్రాంత ప్ర‌యోజ‌నాల‌ను వ‌దిలిపెట్టి.. చంద్ర‌బాబు నాయుడు చెప్పిన‌ట్టుగా చేస్తూ ఉన్నారు. అయితే దీని ఫ‌లితాలు ఎలా ఉంటాయో అనే ఆందోళ‌న వారిలో ఉంది.

అది కూడా వెనుక‌డిన రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ప్రాంత టీడీపీ నేత‌లు కూడా అమ‌రావ‌తినే ఉద్ధ‌రించాలంటూం మాట్లాడుతూ ఉన్నారు. ఇది స‌హ‌జంగానే వారి వారి ప్రాంతాల్లో వారికి నెగిటివ్ గా మారే అవ‌కాశాలున్నాయి.

ఆ సంగ‌త‌లా ఉంటే స్థానిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీడీపీ క్యాడ‌ర్ మాత్రం దిక్కుతోచ‌ని స్థితిలోకి ప‌డిపోతున్న‌ట్టుగా ఉంది. అసెంబ్లీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ తీవ్ర‌మైన ఓట‌మిని ఎదుర్కొంది. అలా పార్టీలో నిస్పృహ కొన‌సాగుతూ ఉంది. ఇంత‌లోనే స్థానిక ఎన్నిక‌లు రానే వ‌స్తున్నాయి. చంద్ర‌బాబు చూస్తే అమ‌రావ‌తి అంటూ అక్క‌డ‌కే ప‌రిమితం అయిపోయారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ క్యాడ‌ర్ త‌మ దారి తాము చూసుకుంటున్న‌ట్టుగా ఉంది.

ఎన్నిక‌ల నేప‌థ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఏమైనా ఛాన్స ఇస్తారేమో అని కొంత‌మంది ప్ర‌య‌త్నాలు సాగిస్తూ ఉన్నార‌ట‌. మామూలుగా అయితే అధికార పార్టీ వాళ్లు ద‌గ్గ‌ర‌కు రానీయ‌రు. అయితే ఇప్పుడు స్థానిక ఎన్నిక‌లు వ‌స్తున్నాయి కాబ‌ట్టి.. చేరిక‌ల‌కు వారు ప్రాధాన్య‌త‌ను ఇవ్వొచ్చు. ఆ మేర‌కు టీడీపీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టుగా స‌మాచారం. ఇప్ప‌టికే అలాంటి చేరిక‌లు షురూ అయ్యాయి. అయితే చంద్ర‌బాబు మాత్రం స్థానిక ఎన్నిక‌లను కాకుండా.. అమ‌రాతే ప్ర‌ధానం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తూ ఉండ‌టంపై ఆ పార్టీ శ్రేణులు విస్మ‌యం వ్య‌క్తం చేస్తూ ఉన్నాయని స‌మాచారం.