Begin typing your search above and press return to search.
క్లియర్ కట్.. ప్రాంతీయ పార్టీలదే రాజ్యం
By: Tupaki Desk | 10 May 2019 11:15 AM GMTదేశంలో రాజకీయ రంగు మారుతోంది. క్లియర్ కట్ గా బీజేపీకి కానీ - కాంగ్రెస్ కానీ పూర్తి స్థాయి మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించకపోవడం.. ఐదు విడతల పోలింగ్ లో బీజేపీకి ఎదురుగాలి వీయడంతో ప్రాంతీయ పార్టీలన్నీ వ్యూహాలు మారుస్తున్నాయి.
కేసీఆర్ ఇప్పటికే దక్షిణాది పర్యటన పెట్టుకొని అందరూ నేతలను కలుస్తున్నారు. ఇక చంద్రబాబు.. రాహుల్ - మమతలతో కలిసి కాంగ్రెస్ కు సపోర్టుగా రాజకీయం నడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాంతీయ పార్టీల బలమెంత అనేది సస్పెన్స్ గా మారింది..
ప్రాథమిక అంచనా ప్రకారం.. బీజేపీకి 180 సీట్లకు మించి రావని కేసీఆర్ ను కలిసిన అనంతరం కేరళ సీఎం విజయన్ ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక కాంగ్రెస్ కు 150 సీట్లు రావచ్చని.. 21 ప్రాంతీయ పార్టీల బలం ఉన్న కాంగ్రెస్ కే దేశంలో అధికారం చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.
1971లో ఇందిరగాంధీ - 1984లో రాజీవ్ గాంధీ భారీ మెజార్టీలతో ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఘోర పరాజయాలను పొందారు. ఇప్పుడు వారి తరహాలోనే 2014లో మోడీ అఖండ మెజార్టీ సాధించారు. 2019కు వచ్చేసరికి పరిస్థితి ఇందిరా - రాజీవ్ లాగానే పునరావృతం కావచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ముఖ్యంగా హిందీ బెల్ట్ లోని మధ్యప్రదేశ్ - రాజస్తాన్ - చత్తీస్ ఘడ్ లో ఓడిపోయిన బీజేపీ ఇప్పుడు భారమంతా ఒడిషా - బెంగాల్ - ఈశాన్య భారతం పైనే పెట్టుకుంది. ఇక్కడ వస్తే ఓకే లేదంటే మోడీ ఓటమి ఖాయమని అనుకుంటున్నారంతా..
దేశంలో హంగ్ వస్తే ప్రాంతీయ పార్టీలే కీలకమవుతాయి. ఒకటి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్.. రెండోది చంద్రబాబు కాంగ్రెస్ మిత్రపక్షాల ఫ్రంట్. ఈ రెండు ఫ్రంట్ లలో ఎవరు కలుస్తారు? మద్దతు బీజేపీకా లేదా కాంగ్రెస్ కా.. లేదంటే జాతీయ పార్టీలే ప్రాంతీయపార్టీల కూటమిని గద్దెనెక్కిస్తాయా అనేది మే 23 తర్వాతే తేలనుంది. మొత్తం గా రాబోయే ఫలితాల తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీలదే రాజ్యం అనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు ఘంఠా పథంగా చెబుతున్నారు.