Begin typing your search above and press return to search.

బీజేపీ ఓట‌మి.. త‌ట‌స్థ పార్టీల‌కు హ్యాపీ!

By:  Tupaki Desk   |   12 Feb 2020 1:30 AM GMT
బీజేపీ ఓట‌మి.. త‌ట‌స్థ పార్టీల‌కు హ్యాపీ!
X
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఓడిపోయింది. మామూలుగా కాదు, చిత్తుగా ఓడింద‌ని చెప్ప‌వ‌చ్చు. 70 స్థానాలకు గానూ కేవ‌లం ఎనిమిది సీట్ల‌లో మాత్ర‌మే భార‌తీయ జ‌న‌తా పార్టీ నెగ్గింది. క‌నీసం గౌర‌వ‌ప్ర‌ద‌మైన ఓట‌మి కూడా కాదు ఇది. స్వ‌యంగా మోడీ అంతా తానై ప్ర‌చారం చేసినా, అమిత్ షా ద‌గ్గ‌రుండి ప్ర‌య‌త్నాలు చేసినా.. ప్ర‌జ‌లు మాత్రం బీజేపీ వైపు మొగ్గ‌లేదు. ఆ పార్టీని చిత్తుగా ఓడించారు.

బీజేపీ ఇలా చిత్తుగా ఓడినా కాంగ్రెస్ పార్టీకి మాత్రం పెద్ద‌గా హ్యాపీనెస్ లేదు. ఎందుకంటే బీజేపీ క‌న్నా కాంగ్రెస్ చిత్తు అయ్యింది. బీజేపీ ఎనిమిది సీట్ల‌లో అయినా నెగ్గ‌గా కాంగ్రెస్ పార్టీ క‌నీసం ఖాతా తెర‌వ‌లేక‌పోయింది. ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలుచుకోలేక‌పోయింది. దీంతో.. కాంగ్రెస్ ఆనంద ప‌డ‌టానికి ఏమీ లేకుండా పోయింది.

ఇక ఇదే స‌మ‌యంలో ఈ ఇరు పార్టీల ఓట‌మి త‌ట‌స్థ పార్టీల‌కు మాత్రం ఊర‌ట అని చెప్ప‌వ‌చ్చు. అటు ఎన్డీయే వైపు లేకుండా, ఇటు యూపీఏ వైపు లేకుండా... ఉన్న పార్టీల‌కు బీజేపీ ఓట‌మి ఆనందాన్ని ఇచ్చే అంశ‌మే. తెలుగు రాష్ట్రాల వ‌ర‌కూ చూసుకుంటే.. తెలంగాణ రాష్ట్ర స‌మితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల‌కు బీజేపీకి త‌గిలిన ఎదురుదెబ్బ ఆనందాన్ని ఇచ్చేదే. త‌మ మీద బీజేపీ దూకుడుగా రాకుండా ఉండ‌టానికి ఆ పార్టీని ఇలాంటి ఓట‌ములు క‌ట్ట‌డి చేస్తాయ‌నేది ఒక విష‌యం. మ‌రో విష‌యం ఏమిటంటే... రాష్ట్రాల్లో ఇలాంటి ఓట‌ముల వ‌ల్ల రాజ్య‌స‌భ‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ మంచి మెజారిటీని తెచ్చుకునే అవ‌కాశాలు త‌గ్గిపోతూ ఉన్నాయి.

అధికారంలోకి వ‌చ్చి ఆరేళ్లు గ‌డుస్తున్నా.. బీజేపీ ఇప్ప‌టి వ‌ర‌కూ రాజ్య‌స‌భ‌లో ప‌టిష్ట‌మైన మెజారిటీని తాక‌లేదు. కొన్ని బిల్లుల విష‌యంలో త‌ట‌స్థ పార్టీల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవాల్సి వ‌స్తోంది. ఇలాంటి నేప‌థ్యంలో వ‌ర‌స‌గా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీకి ఎదురుదెబ్బ త‌గులుతుండ‌టంతో రాజ్య‌స‌భ‌లో ఆ పార్టీ బ‌లం పెర‌గ‌డం క‌ష్టం అవుతోంది. ఇలాంటి నేప‌థ్యంలో త‌ట‌స్థ పార్టీలు బీజేపీ ద‌గ్గ‌ర త‌మ వెయిట్ ను కొన‌సాగించుకునే అవ‌కాశం ఉంది. అటు టీఆర్ఎస్ అయినా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయినా త్వ‌ర‌లోనే రాజ్య‌స‌భ‌లో మ‌రింత బ‌లం పెర‌గ‌బోతోంది. ఇలాంటి నేప‌థ్యంలో ఢిల్లీ బీజేపీ ఓట‌మి ఆ పార్టీల‌ను ఎంతో కొంత ఆనంద పెట్టే అంశ‌మే అనేది ఒక ప‌రిశీల‌న‌.