Begin typing your search above and press return to search.
ఎస్సీ - ఎస్టీల అసైన్డ్ భూములు కాజేసిన టీడీపీ నేతలు !
By: Tupaki Desk | 1 Jan 2020 7:45 AM GMTరాష్ట్రంలో మూడు రాజధానుల పై జరిగే రచ్చలో రాజధాని రైతులకి మద్దతుగా నిలుస్తూ ఏపీ సర్కార్ పై ఊగిపోతున్న టీడీపీ నేతల అసలు బండారం తాజాగా వెలుగులోకి వచ్చింది. కళ్లు మూసుకొని పాలు తాగే పిల్లి కూడా తనని ఎవరు చూడలేదు అని అనుకుంటుంది. కానీ , కళ్లు ఉండేది ఒక్క పిల్లికి మాత్రమే కాదు అన్న విషయం మరచి ఆలా ప్రవర్తిస్తుంటుంది. ఇప్పుడు టీడీపీ నేతలు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అప్పట్లో రాజధాని రైతులకి చేయాల్సిన అన్యాయం అంతా చేసి ..ఇప్పుడు పబ్బం గడుపుకోవడానికి రైతులతో కలిసి ప్రభుత్వం పై పోరాటం అంటూ కొత్త నాటకానికి తెరతీసింది.
అసలు విషయం ఏమిటంటే ... రాజధాని భూములపై జరిగిన స్కామ్ గురించి జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ చంద్రబాబు హయాంలో కేటాయించిన భూములపై ఒక నివేదికను గతేడాది డిసెంబర్ 27న ప్రభుత్వానికి సమర్పించింది. మాములుగా అయితే అసైన్డ్ భూములను ప్రభుత్వం ఎక్స్ సర్వీస్ మెన్ లకు , పేదలకు, భూమి లేని వారికి కేటాయిస్తుంది. ఈ భూములను ఇతరులు కొనరాదు, అలాగే వీటిని ఎవరూ అమ్మరాదు. అయితే , కేబినెట్ సబ్‌కమిటీ సమర్పించిన నివేదికలో అమరావతిలో 30 మంది రియల్టర్లు, ఇతర టీడీపీ నేతలు 444.66 ఎకరాల అసైన్డ్ భూములను ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారి నుంచి కొనుగోలు చేసినట్లు రిపోర్ట్ వెల్లడించింది.
ఏపీ అసైన్డ్ భూముల చట్టం 1977 ప్రకారం, అసైన్డ్ భూములను కొనుగోలు కానీ ఇతరులకు బదిలీ కానీ చేయకూడదు. అయితే ఇక్కడ కొందరు ప్రభావితం చేయగల రియల్టర్లు రాజకీయనాయకుల అండ చూసుకుని దళితులకు గిరిజనులకు కేటాయించిన భూమిని అమ్మాల్సిందిగా వారి పై ఒత్తిడి తీసుకొచ్చినట్లు కేబినెట్ సబ్ కమిటీ తెలిపింది. అసైన్డ్ భూములు కలిగి ఉన్న దళితులు, గిరిజనుల వద్దకు వెళ్లి వారికున్న భూములు ల్యాండ్ పూలింగ్ కింద గుర్తించబడలేదని, దీంతో ఎలాంటి లబ్ధి ప్రభుత్వం నుంచి చేకూరదని మోసపూరితమైన మాటలు చెప్పి వారి వద్ద నుంచి బలవంతంగా భూములను కొనుగోలు చేసినట్లు రిపోర్ట్ లో తెలిపింది.
అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన తర్వాత రియల్టర్లు, కొందరు టీడీపీ నేతలు అసైన్డ్ భూములను కూడా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కిందకు చేర్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఇలా చేస్తే ఆ కొన్న ఆ అసైన్డ్ భూములకు ప్రభుత్వం తరుపున రావాల్సిన అన్ని లబ్ధిలు చేకూరడంతో పాటు అభివృద్ధి చేసి ఇచ్చే ప్లాట్లు వస్తాయని భావించారు. వీరి ఒత్తిడి తో అప్పటి చంద్రబాబు సర్కార్ 2014 డిసెంబర్ 14న అసైన్డ్ భూములు ల్యాండ్ పూలింగ్ స్కామ్ కిందకు వస్తాయంటూ జీవో విడుదల చేశారు. ఇదిలా ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వారి సొంత పేరు తో భూములు కొనుగోలు చేయగా టీడీపీ నేతలు మాత్రం బినామీ పేరుతో భూములు కొనుగోలు చేసినట్లు నివేదిక వెల్లడించింది. ఇందులోను కొన్ని అవకతవకలను కేబినెట్ సబ్ కమిటీ గుర్తించింది.