Begin typing your search above and press return to search.
నోటితో ఊది.. కరోనా అంటిస్తూ.. దారుణ ప్రవర్తన
By: Tupaki Desk | 11 July 2020 11:45 AM ISTప్రపంచం మొత్తం కరోనా వైరస్ పై ఇప్పుడు ఫైట్ చేస్తోంది. దేశంలో మొట్టమొదటి కేసు కేరళలోనే వెలుగుచూసినా ఇప్పుడు ఆ రాష్ట్రం కరోనా ఫ్రీగా మారింది. పట్టుదలతో అక్కడి ప్రభుత్వం, వైద్యులు, పోలీసులు కృషి చేసి కంట్రోల్ చేశారు.
కానీ కొందరు కేరళలో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వైరస్ సోకిన గ్రామంలో శాంపిల్ సేకరిద్దామని వచ్చిన వైద్యులు, సిబ్బందిపై పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. దీంతో వైద్య సిబ్బంది ఆ గ్రామంలోని వెళ్లాలంటేనే భయపడుతున్నారు.
కేరళలోని పూంతారా గ్రామంలో కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలింది. దీంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున వైద్యులు, సిబ్బందిని ఆ గ్రామానికి తరలించింది. కానీ ఆ ఊరి జనం నుంచి మాత్రం విచిత్రమైన అనుభవం వారికి ఎదురైంది. పరీక్షల కోసం రక్త నమూనాలు ఇవ్వాల్సిన ప్రజలు వికృతంగా ప్రవర్తించారు.
శాంపిల్స్ ఇవ్వకుండా వచ్చిన వైద్య సిబ్బందిపై నోటితో ఊదుతూ వారికి వైరస్ అంటించడానికి నానా యాగీ చేశారు. ప్రజలంతా వికృత చేష్టలతో వైద్యసిబ్బంది టెస్టులు చేయకుండా వైద్యులకే అంటించే ప్రయత్నం చేశారు. దీంతో వైద్యులు, సిబ్బందిని క్వారంటైన్ కు తరలించారు.
దీనిపై సీఎం విజయన్ సీరియస్ అయ్యారు. గ్రామంలో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను దించి అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు.
కాగా గ్రామంలో లాక్ డౌన్ విధించి కనీస అవసరాలను కూడా కొనుగోలు చేయనీయకపోవడంపై గ్రామస్థులంతా ఇలా నిరసన తెలిపినట్టు తెలిసింది.