Begin typing your search above and press return to search.
కరోనాతో మరణిస్తే ఎలా పూడ్చుతారు..ఆందోళన చేస్తున్న స్థానికులు!
By: Tupaki Desk | 1 April 2020 7:50 AM GMTకరోనా వైరస్ ..ఈ మహమ్మారి ప్రస్తుతం భారత్ లో వేగంగా పెరిగిపోతుంది. నిన్నటి వరకు దేశంలో కరోనా ప్రభావం పెద్దగా లేదు అనుకుంటున్న తరుణంలో ..ఢిల్లీ లోని మర్కజ్ ప్రార్థనలకి వెళ్లి వచ్చిన వారందరికీ కరోనా పాజిటివ్ అని తేలుతుండటంతో అందరిలో భయం పెరిగిపోతుంది. నిన్న రాత్రి నుండి దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ఊహించని స్థాయిలో పెరిగిపోతున్నాయి. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వాలు కఠిన నియమాలు చేస్తున్నాయి.
ఇకపోతే , కరోనా కారణంగా తెలంగాణ లో చనిపోయిన తోలి వ్యక్తికి వైద్య సిబ్బందే అంత్యక్రియలని పూర్తి చేసారు. అయితే , ఇప్పుడు అంత్యక్రియల ఉదంతం హైదరాబాద్ లో కలకలం రేపుతోంది. దహనం చేయడానికి బదులుగా అతడిని ఖననం చేయడమే కారణం. కరోనాతో మృత్యువాతపడిన పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తిని చాదర్ ఘాట్ పరిధిలోని కాంగా నగర్ లో శ్మశాన వాటికలో మంగళవారం ఖననం చేశారు. దీనిపై స్థానికులు ఆందోళన చేశారు.
కరోనాతో మరణించిన వ్యక్తుల మృతదేహాన్ని దహనం చేయాల్సి ఉండగా.. ఎందుకు పూడ్చిపెట్టారంటూ స్థానికులు ఆందోళన చేశారు. పోలీసులు ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరస్ నిరోధక ద్రావణాన్ని కూడా స్ప్రే చేయకుండా ఎలా ఖననం చేస్తారంటూ ఎస్ ఐ కరణ్ కుమార్ ను నిలదీశారు. కాచిగూడ పోలీసులు వచ్చి స్థానికులకు నచ్చజెప్పారు. అసలు కరోనా వచ్చిన వ్యక్తి చనిపోతే వారిని ఎలా ఖననం చేయడానికి కేంద్రం కొన్ని నియమాలని పెట్టింది. కరోనా కారణంగా మరణించిన వ్యక్తులను నిబంధనల ప్రకారం దహనం చేయాలి. వారు ఏ మతానికి చెందిన వారైనా ఇదే పద్ధతి పాటించాలి. అంత్యక్రియల్లోనూ ఐదుగురి కంటే ఎక్కువ మంది పాల్గొనకూడదని ఆదేశాలున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికే ఈ నిబంధనలు విధించారు.