Begin typing your search above and press return to search.

చైనాలో మళ్లీ లాక్ డౌన్... ప్రజల అవస్థలు..!!

By:  Tupaki Desk   |   5 Jan 2022 2:30 AM GMT
చైనాలో మళ్లీ లాక్ డౌన్... ప్రజల అవస్థలు..!!
X
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకు వైరస్ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. కేవలం వారాల వ్యవధిలోనే కేసు అమాంతం పెరిగిపోయాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి స్థాయిలో చేపట్టిన దేశాల్లో కూడా వైరస్ విజృంభిస్తోంది. ఒక్క అమెరికాలోనే పది లక్షలకు పైగా కేసులు వెలుగు చూసినట్లు పలు సర్వేల్లో వెల్లడించింది. ఇదిలా ఉంటే ఇతర దేశాల్లో కూడా వైరస్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలోనే వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చాలా దేశాలు ఆంక్షల వలయంలోకి వెళ్లాయి. అయినా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. మరోవైపు వైరస్ పుట్టిన చైనా లో కూడా కేసుల సంఖ్య భారీగానే పెరుగుతుంది. దీంతో దేశంలోని చాలా రాష్ట్రాల్లో వైరస్ కు సంబంధించిన ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. కరోనా కేసుల ఎన్ని అనేది ఆ దేశం వెల్లడించడం లేదు. కానీ కొత్త కేసులు వెలుగు చూసిన ప్రతీ నగరంలో ఆంక్షలను తూచా తప్పకుండా అమలు చేస్తోంది.

ఇటీవల చైనాలోని ఓ నగరంలో వైరస్ కేసుల కేవలం రెండు మాత్రమే వెలుగు చూశాయి. అయితే ఏకంగా 10 లక్షలకు పైగా జనాభా ఉన్న ఆ సిటీలో పూర్తిగా లాక్ డౌన్ విధించింది చైనా ప్రభుత్వం. ఆ దేశంలో ఆంక్షలను చాలా కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోనే ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనాలోని యుజ్హౌ న‌గ‌రంలో ఇటీవల కాలంలో కేవం 3 కేసులు బయటపడ్డాయి. దీంతో స్థానిక ప్రభుత్వం ఏకంగా లాక్ డౌన్ ను విధించింది. నగరంలోని జనాభా బయటకు రాకుండా అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కేవలం చైనాలోని ఆ ఒక్క నగరంలోనే గాక కేసులు నమోదు అయిన ఇతర నగరాల్లో కూడా లాక్ డౌన్ విధించడంతో స్థానికంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాకుండా కొంతమంది నిత్యావసర వస్తువులు అందించేందుకు బయటకు వస్తున్నారు. ప్రభుత్వం కూడా నిత్యవసర వస్తువులు అందించేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే చైనాలో వైరస్ కేసుల రోజుకు ఎన్ని నమోదు అవుతున్నాయి అనేది తెలియడం లేదు. దీనిపై ఆ దేశ ప్రభుత్వం యంత్రాంగం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. వైరస్ వెలుగు చూసిన ప్రాంతాల్లో మాత్రం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తోంది. వైరస్ పై అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.