Begin typing your search above and press return to search.
రంజాన్ కి ముందు లాక్ డౌన్ ... ఒవైసీ చేతిలో సీఎంకి ఇత్తడే !
By: Tupaki Desk | 11 May 2021 12:07 PM GMTదేశంలో కరోనా మహమ్మారి జోరు కొనసాగుతున్నా , లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నా , వేలకొద్ది మరణాలు చోటు చేసుకుంటున్నా కూడా రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు తక్కువగా నమోదు అవుతున్నాయి అంటూ సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు లాక్ డౌన్ అంటేనే ఎందుకు అని ప్రశ్నించేవారు. రాష్ట్రంలో కరోనా కంట్రోల్ లో ఉంది అంటూ లాక్ డౌన్ వేసే ప్రసక్తే లేదు అని చెప్తూ వచ్చారు. అయితే , రాష్ట్ర హైకోర్టు రాష్ట్రంలో కరోనా పరిస్థితి , లాక్ డౌన్ , కర్ఫ్యూ అమలు పై తీవ్ర స్థాయిలో విరుచుపడుతుండటంతో ఎట్టకేలకి బుధవారం నుండి పది రోజుల పాటు రాష్ట్రంలో లాక్ డౌన్ అనౌన్స్ చేశారు. అయితే, రాష్ట్రంలో రంజాన్ పండుగ సమయంలో ప్రకటించిన లాక్ డౌన్ కచ్చితంగా అమలయ్యేంత సీన్ ఉండదని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఈనెల 12 నుంచి మే22 వరకు, అంటే 10 రోజులపాటు లాక్ డౌన్ అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే , నిత్యావసర సరుకుల కోసం లాక్ డౌన్ ఉండే 10 రోజులపాటు ఉదయం 6 నుంచి 10 గంటలవరకు లాక్ డౌన్ నుండి మినహాయింపులు ఇచ్చారు. ఉదయం 10 గంటల నుంచి లాక్ డౌన్ అమల్లోకి వస్తుంది. అయితే , మరికొన్ని రోజుల్లోనే రంజాన్ పండుగ ఉండగా కేసీఆర్ సర్కారు లాక్ డౌన్ విధించడంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఊహించని వ్యాఖ్యలు చేశారు. కరోనా ఆంక్షలకు సంబంధించి సీఎం కేసీఆర్ ఇప్పటిదాకా ఇచ్చిన ఆంక్షల ఆదేశాలేవీ సరిగా అమలు కాలేదని, లాక్ డౌన్ విషయంలోనూ అలానే జరుగుతుందని బండి సంజయ్ అన్నారు. కరోనా కేసులు, మరణాల విషయంలో టీఆర్ ఎస్ ప్రభుత్వం అబద్దాలు చెబుతోందని, కేసీఆర్ సరైన లెక్కలు చెప్పని కారణంగానే కేంద్రం నుంచి తెలంగాణకు పూర్తిస్థాయిలో సహాయం అందడంలేదన్నారు.
ప్రధాని మోదీకి సలహాలిచ్చానని సీఎం కేసీఆర్ చెప్పుకోవటం సిగ్గుచేటని, ఉన్నతస్థాయిలో జరిగే అంతర్గత సమావేశ విషయాలు బయటకు చెప్పటం సరైంది కాదని సంజయ్ చెప్పుకొచ్చారు. రంజాన్ పండగకు ముందు లాక్ డౌన్ పెడితే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ తనవాళ్లను వెంటేసుకొని సీఎం క్యాంపు ఆఫీసుకు వచ్చి , కేసీఆర్ ను బరిగెలతో కొడతారని , ఇప్పటికే మజ్లిస్ చీఫ్ అంటే సీఎంకు వణుకు అని , ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న నైట్ కర్ఫ్యూ పాతబస్తీలో అమలు కాకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. టీఆర్ ఎస్ ప్రభుత్వం కేవలం ఒక్క వర్గం కోసమే పనిచేస్తోందని , నిఖార్సైన హిందువునని చెప్పుకునే కేసీఆర్ భయంతోనే ఒక వర్గానికి మద్దతు ఇస్తున్నాడని , కేవలం హైకోర్టుకు భయపడి లాక్ డౌన్ పెట్టాలనుకుంటున్నాడేగానీ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కాదు అంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతోంది.