Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఫ్యాక్చర్ అయిన కాలుతో 245 కిమీ నడక ..?
By: Tupaki Desk | 31 March 2020 10:50 AM GMTకరోనా వైరస్ ను దేశంలో వేగంగా విస్తరించకుండా, అరికట్టడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను అమల్లోకి తీసుకువచ్చారు. కరోనా కి మందు లేకపోవడం , అలాగే ఈ మహమ్మారి అత్యంత భయంకరమైనది కావడంతో కరోనాని అడ్డుకోవడానికి లాక్ డౌన్ ఒక్కటే మార్గం అని భావించిన కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని అమల్లోకి తీసుకువచ్చింది. అయితే , ఇది మంచిదే అయినప్పటికీ .. లాక్ డౌన్ విధించడంతో వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉపాధిలేక, తింటానికి తిండిలేక పొట్టచేతపట్టుకుని సొంత గ్రామాలకు బయలుదేరుతున్నారు.
అయితే , లాక్ డౌన్ నేపథ్యంలో బస్సు సౌకర్యం లేకపోవడంతో చాలామంది తమ కాళ్లకి పని చెబుతున్నారు. నెత్తి మీద ఒక మూట, చంకలో పిల్ల, రెండు చేతుల నిండా పెద్ద పెద్ద బ్యాగుల్లో సామాన్లతో వలస కార్మికులు నడుస్తున్న దృశ్యాలు దేశ వ్యాప్తంగా చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజస్తాన్ నుంచి మధ్యప్రదేశ్ కు వలస వచ్చిన ఓ కార్మికుడి పరిస్థితి కన్నీరు తెప్పిస్తోంది. ఇంటికెళ్లే మార్గంలేకపోవడంతో కాలుకున్న సిమెంట్ కట్టును స్వయంగా తొలగించుకుని కాలి నడనక స్వస్థలానికి బయలేదేరాడు.
ఈ ఘటనపై పూర్తి వివరాలు చూస్తే ... భన్వరాల్ అనే కార్మికుడు మధ్యప్రదేశ్ లోని హుస్నాగాబాద్ ప్రాంతం నుంచి ఉపాధి కోసం రాజస్తాన్‌కు వలస వెళ్లాడు. ఈ క్రమంలోనే పని ప్రదేశంలో ప్రమాదశాత్తు కాలు ఫ్యాక్చర్ కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు. ఓవైపు ఉపాధిలేక, మరోవైపు ఇంటికి పంపేందుకు డబ్బులులేక అవస్థలు పడుతున్నాడు. స్వస్థలానికి వెళ్లడానికి వాహన సదుపాయం కూడా లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ అక్కడే గడపుతున్నాడు. అయితే , ఈ లాక్ డౌన్ ఎన్ని రోజులు ఉంటుందో పూర్తిగా చెప్పలేని పరిస్థితుల్లో చేసేదేమి లేక కాలుకున్న సిమెంట్ కట్టును స్వయంగా తొలగించుకుని కాలి నడకన స్వస్థలానికి బయలేదేరాడు. సుమారు 245 కిలో మీటర్లు నడక ద్వారా రాజస్తాన్ లోని తన నివాసానికి వెళ్లాడానికి సిద్ధమయ్యాడు. రోడ్డుపై దీనిని చూసిన వారంతా చలించిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ఓ వ్యక్తి షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ఇకపోతే ఇలా కాలి నడకన సొంత ఊర్లకి బయల్దేరుతున్న వారిలో కొందరు మృతి చెందుతున్నారు. అయితే , తెలంగాణలో ఉన్న వలస కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే.