Begin typing your search above and press return to search.
తెలంగాణ : లాక్ డౌన్ ఎఫెక్ట్.. రోడ్లన్నీ జామ్ !
By: Tupaki Desk | 12 May 2021 5:30 AM GMTతెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కట్టడికి లాక్ డౌన్ విధించడం తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రోజులో 4 గంటల పాటు కార్యకలాపాలు, మిగిలిన 20 గంటలు లాక్ డౌన్. అయితే, ఈ లాక్ డౌన్ అన్ని రంగాలకు వర్తించదు. కొన్ని అత్యవసర సర్వీసులు, రంగాలను లాక్ డౌన్ నుంచి మినహాయించారు. మే 20న తెలంగాణ క్యాబినెట్ మరోసారి సమావేశమై లాక్ డౌన్ పై సమీక్ష జరపనుంది. ఇదిలా ఉంటే .. లాక్ డౌన్ నేపథ్యంలో నగరంలో తెల్లవారుజాము నుంచే నగరంలోని రోడ్లని జామ్ అయ్యాయి. మలక్ పేట, చాదర్ ఘాట్, సైదాబాద్, అజాంపురాలతో పాటుగా నగరంలో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ఉదయం 10 గంటలకు వరకు సడలింపుతో వ్యాపారులు దుకాణాలు తెరిచారు. దీంతో కొనుగోలుదారులు మాల్స్, దుకాణాల వద్దకు ఎగబడ్డారు. మలక్‌పేట్‌లోని మాదన్నపేట మార్కెట్ లలో చిరు వ్యాపారులు పోటెత్తారు. కూరగాయలు, నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి ట్రాలీ ఆటోలు, బైక్ లపై తరలిస్తున్నారు. అంతేకాకుండా వైన్స్ దుకాణాలు సైతం ఉదయం 6 గంటలకే తెరుచుకోవడంతో పలుచోట్ల రోడ్లన్నీ జామ్ అయ్యాయి. ఇక లాక్ డౌన్ ప్రకటించడం తో నగరం నుండి సొంత ఊర్లకి పయనం కావడంతో జాతీయ రహదారులపై కూడా భారీగా ట్రాఫిక్ కనిపిస్తుంది. తమ ఊర్లకు వెళ్లేవారు తమ వాహనాల్లో బయలు దేరుతున్నారు. దీంతో రోడ్లన్ని కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసిన షాపింగ్ చేస్తూ జనాలు కనిపిస్తున్నారు.ఇదే అదునుగా భావించిన కిరాణం, కూరగాయల వ్యాపారులు ఒక్కసారిగా రేట్లను పెంచేశారు. అలాగే నిత్యావసర సరుకుల ధరలను కూడా పెంచి అమ్ముతున్నారు. కూరగాయల కోసం, నిత్యావసర సరుకుల కోసం, మద్యం కోసం పరుగులు పెట్టారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించగా మాస్క్ , భౌతికదూరాన్ని పక్కన పెట్టేసి ఒకరిపై ఒకరుపడుతూ కొనుగోలు చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.