Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ ఎఫెక్ట్ .. ఆ సిటీలో లక్ష ఉద్యోగాలు ఫట్ !
By: Tupaki Desk | 15 Jun 2021 11:30 PM GMTకరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. కరోనా వైరస్ తీసుకొచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలతో ఎక్కడికక్కడ ఆర్థిక లావాదేవీలు ఆగిపోవటం మాత్రమే కాక షాపింగ్ మాల్స్ ఇంకా చాలా సంస్థలు క్లోజ్ అయిపోయాయి. ఇటువంటి తరుణంలో ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలకు వెళ్లలేని పరిస్థితులు నెలకొని ఉండటం తో.మరోపక్క బిజినెస్ ఆగిపోవటంతో లక్షలాదిమంది దేశవ్యాప్తంగా తమ ఉద్యోగాలను కోల్పోయారు. లాక్ డౌన్ కాలంలో అన్ని రంగాలు కుదేలయ్యాయి. నిత్యం వినియోగదారులతో కళకళలాడే షాపింగ్ మాల్స్ లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. నష్టాలను పూడ్చుకునేందుకు మాల్స్ తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటు వస్తున్నది.
కేవలం మే నెలలోనే కొన్ని మిలియన్ల ఉద్యోగాలు ఇండియాలో కొంతమంది కోల్పోవటం జరిగిందని ప్రముఖ మీడియా సంస్థ ఇటీవల వార్తలలో తెలియజేశాయి. ఇదిలా ఉంటే బెంగళూరు మహానగరంలో కూడా కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో అక్కడ షాపింగ్ మాల్స్ అన్నీ కొన్ని నెలలపాటు క్లోజ్ అయిపోయాయి. ఒక్క బెంగళూరు నగరంలోనే కరోనా కాలంలో లక్షమందికి పైగా ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. దీంతో షాపింగ్ సెంటర్స్ అసోసియోషన్ కర్ణాటక సీఎం యడ్యూరప్పకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో షాపింగ్ మాల్స్ అసోసియేషన్. ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని గుజరాత్ రాష్ట్రంలో నష్టపోయిన షాపింగ్ సెంటర్లకు ఇచ్చిన రాయితీలు. ఇక్కడ కూడా కల్పించాలి అంటూ సీఎం ఎడ్యూరప్ప కు లెటర్ రాయటం జరిగింది. గుజరాత్ లో ఉన్నది బీజేపీ ప్రభుత్వం అక్కడ కల్పించిన రాయితీలు ఇక్కడ కూడా కల్పించాలి అని బెంగళూరు షాపింగ్ యాజమాన్యాలు కర్ణాటక బిజెపి ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.