Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ 4.0 రూల్స్ ఇలానే ఉండనున్నాయా?

By:  Tupaki Desk   |   16 May 2020 5:00 AM GMT
లాక్ డౌన్ 4.0 రూల్స్ ఇలానే ఉండనున్నాయా?
X
చూస్తుండగానే లాక్ డౌన్ 3.0 మరో రోజులో ముగియనుంది. కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ కు తెలంగాణ.. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు ఇప్పటికే ఈ నెలాఖరు వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే.. తాము అమలు చేస్తున్న లాక్ డౌన్ లో కేంద్రం ఇచ్చే మార్గదర్శకాల్ని తమకు అనుగుణంగా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ పరిమితంగా ఉన్న సడలింపులు లాక్ డౌన్ 4.0లో ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలు వ్యాపార.. వాణిజ్య సంస్థలు మూసి ఉంచటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక చక్రం ఆగి పోవటంతో కిందా మీదా పడుతున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటి మాదిరే పరిస్థితుల్ని కొనసాగితే.. రానున్న రోజుల్లో ఆకలి చావులు.. మానసిక సమస్యలతో ఆత్మహత్యలు మరింత పెరిగే వీలుంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటివరకూ అమలు చేసిన మూడు లాక్ డౌన్ లకు భిన్నంగా 4.0 ఉంటుందని చెబుతున్నారు.
లాక్ డౌన్ 4.0లో గ్రీన్ జోన్ల లో అన్ని రకాల సేవలకు అనుమతులు ఇవ్వనున్నారు. అదే సమయంలో ఆరెంజ్ జోన్లలో కొన్ని ఆంక్షల్ని అమలు చేస్తారు. రెడ్ జోన్లలో మాత్రం మినహాయింపులు తక్కువగా ఉండే వీలుంది. ఇక.. కేసులు నమోదయ్యే కంటైన్ మెంట్ ప్రాంతాల్లో మాత్రం నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తారు.

లాక్ డౌన్ 4.0 ఎలా ఉంటుందంటే..
% రెడ్ జోన్ లోని కంటైన్మెంట్ కేంద్రాలు తప్పించి.. మిగిలిన అన్నిచోట్ల ప్రజా రవాణాను దాదాపుగా పునరుద్దరించే వీలుంది. బస్సులు.. మెట్రో సేవల్ని ప్రారంభిస్తారు. కాకుంటే ప్రయాణికుల్ని పరిమితంగా అనుమతిస్తారు.
% రైల్వేలు.. విమాన రంగానికి పాక్షికంగా సడలింపులు.
% వ్యాపార సంస్థల్ని తెరిచేందుకు అధికారమంతా ఆయా రాష్ట్రాలకే అప్పగిస్తారు
% రెడ్ జోన్లలోనూ నిత్యవసర వస్తువుల్ని డెలివరీ చేసేలా ఈ-కామర్స్ సంస్థలకు అనుమతులు
% కేసుల తీవ్రత లేని రాష్ట్రాల్లో హోటళ్లు.. రెస్టారెంట్లతో పాటు పర్యాటక రంగానికి అనుమతులు ఇవ్వనున్నారు.
% సెలూన్లను కూడా అనుమతులు ఇచ్చే వీలుంది
% ఇదిలా ఉంటే.. కీలకమైన స్కూళ్లు..కాలేజీలు.. షాపింగ్ మాల్స్.. మల్టీఫ్లెక్సులకు మాత్రం 4.0లో ఓపెన్ అయ్యే అవకాశం లేనట్లే.