Begin typing your search above and press return to search.

రెస్టారెంట్లు.. మాల్స్ కాదు.. బార్లు.. పబ్ లకు కేసీఆర్ ఓకే?

By:  Tupaki Desk   |   6 Jun 2020 5:30 AM GMT
రెస్టారెంట్లు.. మాల్స్ కాదు.. బార్లు.. పబ్ లకు కేసీఆర్ ఓకే?
X
కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ విధిస్తూ రెండున్నర నెలలకు ముందు.. దేశంలోని చాలా రాష్ట్రాల కంటే ముందుగా నిర్ణయం తీసుకొని ఆశ్చర్యానికి గురి చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కసీఆర్. మహమ్మారి కట్టడికి లాక్ డౌన్ కు మించిన ఆయుధం మరొకటి లేదని.. భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రజలు ఎవరి ఇళ్లల్లో వారు ఉండాలని కోరారు. అనుకున్నట్లే లాక్ డౌన్ అమలు చేయటం.. ఆర్థికంగా కిందామీదా పడిపోవటం తెలిసిందే.

లాక్ డౌన్ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సమస్యలు ఏ రీతిలో ఉంటాయన్నది అర్థమయ్యాక.. జాగ్రత్తలు పాటిస్తూ.. మహమ్మారితో సహజీవనం చేస్తూ.. బతుకుబండిని లాగాలన్న సత్యం చాలామందికి అర్థమైంది. అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి. లాక్ డౌన్ 5.0ను కంటిన్యూ చేస్తూ అన్ లాక్ 1.0 ప్రోగ్రామ్ ను షురూ చేసింది కేంద్రం. ఇందులో భాగంగా ఈ నెల ఎనిమిది (సోమవారం) నుంచి రెస్టారెంట్లు.. మాల్స్ తో పాటు.. ప్రార్థనాలయాలను తెరవాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఆలోచిస్తుందన్నదితాజా సమాచారం. ఇప్పటికే రెస్టారెంట్లు.. మాల్స్ తెరవాలని డిసైడ్ చేసిన నేపథ్యంలో.. దీనికి అదనంగా బార్లు.. పబ్బులకు ఓకే చెప్పేస్తే పోలా? అన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. దాదాపు ప్రతి రెస్టారెంట్ కు అనుబంధంగా బార్ ఉన్న నేపథ్యంలో.. వాటిని వినియోగంలోకి తెచ్చేస్తే అన్నివిధాలుగా బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక.. మిగిలిన పబ్బుల్ని సైతం సోమవారం నుంచి షురూ చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. రానున్న ఒకట్రెండు రోజుల్లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. అదే జరిగితే.. ఆన్ లాక్ 1.0లోనే అన్ని వ్యాపార.. వాణిజ్య కార్యకలాపాలు షురూ అవుతాయని చెప్పక తప్పదు.