Begin typing your search above and press return to search.
మరో లాక్ డౌన్? ఈసారి ఎన్ని రోజులు? బ్యాక్ గ్రౌండ్ వర్క్ మొదలు?
By: Tupaki Desk | 29 May 2020 4:30 AM GMTమాయదారి మహమ్మారి దేశానికి వచ్చేయటం.. ముందస్తు జాగ్రత్తగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను షురూ చేయటం.. చూస్తుండగా పలు లాక్ డౌన్ లు చూసేసిన పరిస్థితి. దగ్గర దగ్గర పది వారాలకు పైనే సాగిన లాక్ డౌన్ ను ఇటీవల కాలంలో పలు మినహాయింపులు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మరోమారు లాక్ డౌన్ అవసరముందా? అన్నది క్వశ్చన్. తాజాగా అమలవుతున్న లాక్ డౌన్ ఈ నెల 31న ముగియనుంది.
మరి.. జూన్ 1 నుంచి లాక్ డౌన్ ఉంటుందా? లేదా? అన్నది ఒక ప్రశ్న అయితే.. మెజార్టీ వర్గీయుల అభిప్రాయం ప్రకారం లాక్ డౌన్ ను అమలు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. కాకుంటే.. ఇప్పుడు ఏదైతే అమలు చేస్తున్నారో.. అలాంటి నిబంధనల్నే అమలు చేస్తూ మరికొంతకాలం లాక్ డౌన్ ను పొడిగించాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు. ప్రస్తుతం అన్ని రకాల దుకాణాల్ని ఓపెన్ చేసినా.. మాల్స్.. థియేటర్లు.. మల్టీఫ్లెక్సులు.. గుడులు..చర్చిలు.. మసీదులతో పాటు విద్యా సంస్థలు మూసివేసి ఉంచుతున్నారు. ప్రజారవాణా సైతం పాక్షికంగానే నడుస్తున్న సంగతి తెలిసిందే.
ఇదే తీరును మరికొంతకాలం అమలు చేయాలన్నది కేంద్రం ఆలోచనగా చెబుతున్నారు. ఇందులో భాగంగా మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ పొడిగించే దిశగా కేంద్రం ఆలోచిస్తుందని చెబుతున్నారు. తాజాగా ఈ అంశంపై బ్యాక్ గ్రౌండ్ వర్కును కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు ముఖ్యమంత్రులతో మాట్లాడిన ఆయన.. రానున్న రోజుల్లో మరి కొందరితోనూ మాట్లాడనున్నట్లు చెబుతున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇటీవల కాలంలో కేంద్రం తీసుకుంటున్న చర్యలేవీ రాష్ట్రాలతో సంప్రదింపులు జరపకుండానే అన్న విమర్శలు పెరుగుతున్న వేళ. .లాక్ డౌన్ పొడిగింపు అవసరమా? లేదా? అన్న అంశంపై మాత్రం అభిప్రాయ సేకరణ చేయటాన్ని తప్పు పడుతున్నారు. కీలక అంశాల విషయంలో రాష్ట్రాల్ని సంప్రదించకుండా.. లాక్ డౌన్ పొడిగింపు లాంటి వాటికి ఫోన్లు చేస్తే ప్రయోజనం ఏమిటన్నది ప్రశ్న. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ వద్దని చెప్పేవారెవరుంటారు? అన్నది రాష్ట్రాల ప్రశ్న.