Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ 6: కీలక నిర్ణయం దిశగా కేసీఆర్

By:  Tupaki Desk   |   28 Jun 2020 12:38 PM GMT
లాక్ డౌన్ 6: కీలక నిర్ణయం దిశగా కేసీఆర్
X
తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో సీరియస్ నిర్ణయం దిశగా కేసీఆర్ డిసైడ్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న హైదరాబాద్ పై నజర్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్ 6 దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కట్టడికి మూడు, నాలుగు రోజుల్లో వ్యూహం ఖరారు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో అందులోనూ జీహెచ్ఎంసీ పరిధిలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో కేసీఆర్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడి, లాక్ డౌన్ విధించడం లాంటి అంశాలపై సమావేశంలో చర్చించారు.

రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తేశాక కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కరోనా పరీక్షల సంఖ్యను పెంచిన తర్వాత ఇది మరింత ఎక్కువైంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 1087 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 888 కేసులు కేవలం జీహెచ్ఎంసీలోనే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఈ నేపథ్యంలో 90శాతం కేసులు జీహెచ్ఎంసీలోనే కావడంతో సీఎం కేసీఆర్ మళ్లీ లాక్ డౌన్ విధించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీలో లాక్ డౌన్ విధింపుపై కొద్దిరోజుల్లోనే నిర్ణయం దిశగా సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. అలాగే అందరికీ సరైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టినట్టు సమాచారం. పరిస్థితి చూస్తుంటే లాక్ డౌన్ 6 దిశగా కేసీఆర్ తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.