Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : జూన్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ పొడగించారు
By: Tupaki Desk | 30 May 2020 3:00 PM GMTఊహించిందే జరిగింది. లాక్ డౌన్ మళ్లీ పొడగించచారు. జూన్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ పొడగించారు. ఐదో దశలో ఫోకస్ మొత్తం కంటెయిన్మెంట్ జోన్ల మీదే ఉంది. ఇతర ప్రాంతాల్లో మాత్రం మరిన్ని సడలింపులు తాజాగా కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భేటీ అయి జూన్ 1 తర్వాత పరిస్థితి,కరోనా కేసులు, లాక్డౌన్ పొడిగింపు, సడలింపులు తదితరాలపై చర్చించారు. ముఖ్యమంత్రులతో ఫోన్లో జరిపిన చర్చల గురించి, సీఎంలు వ్యక్తం చేసిన అభిప్రాయాల గురించి మోడీకి షా వివరించారు. శుక్రవారం లోక్కల్యాణ్ మార్గ్లోని ప్రధాని ఇంట్లో జరిగిన మీటింగ్లో కేబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌబా, ఇతర కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. అనంతరం లాక్ డౌన్ పొడగింపుపై కీలక నిర్ణయాలు వెలువరించారు.
లాక్ డౌన్ 5.0లో కేంద్రం పలు కొత్త సడలింపులు ఇచ్చింది. రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగుతుందని హోం శాఖ స్పష్టం చేసింది. అయితే సమయం తగ్గించారు. రాత్రి 9 గం.ల నుంచి ఉదయం 5గం.ల వరకు రాత్రి కర్ఫ్యూ కొనసాగనుంది. కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్ డౌన్ మరింత కఠినతరం చేశారు.
దశల వారీగా వీటికి సడలింపులు ఇచ్చింది
ఫేజ్ 1...
షాపింగ్ మాల్స్, ప్రార్థన మందిరాలు, లాడ్జింగ్ హోటల్స్, రెస్టారెంట్స్ తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, జూన్ 8 నుంచి వీటిని తెరుచుకోవచ్చునని వెల్లడించింది.
ఫేజ్ 2
జులై నుంచి స్కూళ్లు, కాలేజీలకు అనుమతి దక్కనుంది. రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం తేదీలు నిర్ణయిస్తారు.
ఫేజ్ 3
అంతర్జాతీయ ప్రయాణాలు, సినిమా హాళ్లు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్ పై వంటి వాటికి సడలింపులు ఉంటాయి. వీటికి చాలా కసరత్తు చేయాల్సి ఉంది. తేదీలేమీ డిసైడ్ చేయలేదు. బహుశా జులై లేదా ఆగస్టులో వీటికి సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది.
కాగా, మార్చి 24న దేశమంతటా 21 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. తర్వాత కొన్ని సడలింపులతో లాక్డౌన్ను మూడు సార్లు పొడిగించారు. ఆదివారంతో నాలుగో దశ ముగియనుంది. ఈ క్రమంలో శనివారం లాక్డౌన్ 5.0పై ప్రధాని మోడీ ప్రకటన చేస్తారని అధికార వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. మరోవైపు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ను మరికొన్ని రోజులు కొనసాగిస్తున్నట్లు ప్రకటించాయి.