Begin typing your search above and press return to search.

ఢిల్లీలో లాక్​డౌన్​ పొడిగింపు.. ప్రజలకు ఓ గుడ్​న్యూస్​ కూడా..!

By:  Tupaki Desk   |   23 May 2021 12:30 PM GMT
ఢిల్లీలో లాక్​డౌన్​ పొడిగింపు.. ప్రజలకు ఓ గుడ్​న్యూస్​ కూడా..!
X
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు కట్టడికి అక్కడి సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ కఠిన లాక్​డౌన్​ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీలో లాక్​డౌన్​ కొనసాగుతుండగా.. మే 31 వరకు లాక్​డౌన్​ పొడిగిస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఓ గుడ్​న్యూస్​ కూడా చెప్పారు సీఎం.. అదేమిటంటే.. ఒకవేళ కేసులు సంఖ్య తగ్గితే మే 31 తర్వాత అన్​లాక్​ విధించనున్నట్టు ఆయన చెప్పారు.

ఢిల్లీలో లాక్​డౌన్​ పొడిగించడం ఇది ఆరోసారి.

కరోనా సెకండ్​ వేవ్​ ప్రభావం ఢిల్లీ, మహారాష్ట్రలోనే ఎక్కువగా ప్రభావం చూపింది. ఢిల్లీలో కఠిన ఆంక్షలు అమలు చేయడంతో కరోనా ఉధృతి తగ్గింది. ప్రతిరోజు అక్కడ 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యేవి. ఓ దశలో అంతకంటే ఎక్కువగా 30 వేల వరకూ కేసులు వచ్చాయి. అయితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ ఎంతో సమర్థవంతంగా పనిచేసి కరోనాను కట్టడిచేయగలిగారు.

ప్రస్తుతం ఢిల్లీలో పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. గతంలో 35 శాతం ఉన్న పాజిటివిటీ కేసులు .. ప్రస్తుతం 2.5 శాతానికి తగ్గాయని అధికారులు చెబుతున్నారు. శనివారం అక్కడ కేవలం 1600 కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీనిబట్టి.. లాక్​డౌన్​ సత్ఫలితాలు ఇచ్చిందని అర్థమవుతుందని అధికారులు అంటున్నారు.

ఈ విషయంపై సీఎం కేజ్రీవాల్​ మాట్లాడుతూ.. ఢిల్లీలో కేసుల సంఖ్య ఇంకా తగ్గించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ నెల 31 వరకు కేసుల సంఖ్య సున్నాకు తీసుకొస్తామని చెప్పారు. ఆ తర్వాత క్రమంగా ఆంక్షలు ఎత్తేస్తామని చెప్పారు. కఠినమైన ఆంక్షలు అమలు చేయడం వల్లే ఢిల్లీలో కేసుల సంఖ్య తగ్గిందని ఆయన చెప్పారు. మొదట దేశంలోనే అత్యధిక కేసులు ఢిల్లీలో నమోదయ్యేవని చెప్పారు. కానీ ప్రస్తుతం కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. ఇక ఢిల్లీలో థర్డ్​వేవ్​ వచ్చే అవకాశం ఉండదని ఆయన పేర్కొన్నారు.

ఢిల్లీలో ప్రజలందరికీ వ్యాక్సిన్​ ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలోని 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికి వ్యాక్సిన్​ ఇస్తామని ఆయన చెప్పారు. అయితే ఒకవేళ మే 31 తర్వాత కూడా కేసుల సంఖ్య తగ్గకపోతే మాత్రం లాక్​డౌన్​ పొడిగిస్తామని పరోక్ష సంకేతాలు ఇచ్చారు కేజ్రీవాల్​.