Begin typing your search above and press return to search.
సడలింపులతో లాక్‌డౌన్ కొనసాగించే అవకాశం
By: Tupaki Desk | 13 April 2020 9:50 AM GMTఏప్రిల్ 14వ తేదీతో లాక్‌డౌన్ గడువు ముగియనుంది. అయినా దేశంలో కరోనా వైరస్ కట్టడి కాలేదు. రోజురోజుకు ఆ కేసులు పెరుగుతున్న సందర్భంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని డిమాండ్ చేశాయి. అయితే దేశంలో ఎలాంటి నిర్ణయమైనా ఉండని తమ రాష్ట్రాల్లో మాత్రం లాక్‌డౌన్ కొనసాగిస్తామని పలు రాష్ట్రాలు ప్రకటించేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలనే అంశంపై సమాలోచనలు చేస్తోంది. ఈ క్రమంలో సంపూర్ణ లాక్‌డౌన్ కాకుండా సడలింపులతో లాక్‌డౌన్ అమలు చేసేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ విధించి.. కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో స్వల్ప సడలింపుతో లాక్‌డౌన్ కొనసాగాలని జగన్ ప్రతిపాదించారు. ఇదే విధానంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ కొనసాగించే అవకాశం ఉంది. ఈ విధానంతో దేశ ఆర్థిక వ్యవస్థకు కొంత ఊరటతో పాటు రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతాయని భావిస్తున్నారు.
మంగళవారంతో ముగియనున్న తొలి విడత లాక్‌డౌన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. రెండో విడత లాక్‌డౌన్ పై మూడు రోజులుగా కేంద్రం సమాలోచనలు చేస్తోంది. ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగింపు పక్కా ఉంటుంది. కానీ కొన్ని సడలింపులు ఉంటాయనేది తెలుస్తోంది. ఈ క్రమంలో దేశాన్ని జోన్లుగా విభజించే యోచనలో ఉన్నట్టు సమాచారం. వైరస్ ఉధృతిని బట్టి వివిధ ప్రాంతాలను వేర్వేరు రంగులతో గుర్తించి ఆయా ప్రాంతాల్లో లాక్‌డౌన్ పలు విధాల్లో అమలు చేసేఏ అవకాశం ఉంది.
ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించనుంది. 15 కేసుల కంటే తక్కువ కేసులు ఉన్న ప్రాంతాలను ఆరెంజ్ జోన్‌గా, కరోనా ప్రభావం అస్సలు లేని ప్రాంతాలను గ్రీన్ జో్న్‌గా గుర్తించేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా ప్రభావం లేని జిల్లాలు దాదాపు 400 ఉన్నాయి. వాటన్నిటిని గ్రీన్ జోన్ పరిధిలోకి తీసుకెళ్లనున్నారు. ఈ గ్రీన్ జోన్‌లో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేసే అవకాశం ఉంది.
ఏప్రిల్ 11వ తేదీ శనివారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాక్‌డౌన్ పొడిగించవచ్చని సూత్రప్రాయంగా తెలిపారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం సడలింపులు ఉంటాయని, ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం కోసం కొన్నిచోట్ల మినహాయింపులు ఉండవచ్చని వెల్లడించారు.