Begin typing your search above and press return to search.
తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు
By: Tupaki Desk | 18 May 2021 3:38 PM GMTతెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ గడువును మరికొన్నాళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలుత పది రోజులు లాక్ డౌన్ ప్రకటించిన ముఖ్యమంత్రి.. ఈ నెల 30 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించారు. గడువు పొడిగింపు విషయంలో మంత్రుల అభిప్రాయాలు సేకరించిన ముఖ్యమంత్రి.. ముందుకు వెళ్లడానికే నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 20న జరగాల్సిన కేబినెట్ సమావేశం కూడా వాయిదా వేశారు.
ఇదిలాఉంటే.. లాక్ డౌన్ పొడిగింపుతో రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్యే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 3,982 కేసులు నమోదయ్యాయి. 27 మంది మృతిచెందారు.
లాక్‌డౌన్ కు ముందు ఒక రోజు కేసుల సంఖ్య పదివేల వరకు నమోదవడం గమనార్హం. పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉన్న నేపథ్యంలో మరికొన్ని రోజులు లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 5 లక్షల 36 వేల 766 మందికి చేరింది. ఇందులో 4 లక్షల 85 వేల 644 కేసులు రికవరీ అయ్యాయి. ప్రస్తుతం 48,110 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.