Begin typing your search above and press return to search.
ఆంక్షల సడలింపు: హైదరాబాద్ రోడ్లు జనాలతో కళకళ
By: Tupaki Desk | 19 May 2020 11:30 AM GMTవైరస్ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో హైదరాబాద్ రోడ్లన్నీ వెలవెబోయాయి. ఎప్పుడూ చూడని పరిస్థితి హైదరాబాద్‌లో కనిపించింది. దాదాపు రెండు నెలల తర్వాత మంగళవారం (మే 19వ తేదీ)తో హైదరాబాద్‌లో కొంత సాధారణ పరిస్థితి ఏర్పడింది. కంటైన్‌మెంట్ జోన్‌లు మినహా అన్ని ప్రాంతాల్లో ప్రజా జీవనం యథాతథంగా కొనసాగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ప్రకటించారు. కార్యాలయాలు, చాలా వ్యాపారాలు కూడా తెరచుకోవడంతో హైదరాబాద్‌కు పూర్వ వైభవం వచ్చింది. ఒక్క ఆర్టీసీ, మెట్రో రైల్‌కు అనుమతి ఇవ్వలేదు. కానీ ఆటోలు, క్యాబ్‌లకు అనుమతి ఇవ్వడంతో రోడ్డెక్కాయి. సొంత వాహనదారులకు ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో హైదరాబాద్‌పై మళ్లీ ప్రజల సందడి కనిపించింది.
నాలుగో దశ లాక్‌డౌన్ కొనసాగుతున్నా లాక్‌డౌన్ మాదిరిగా పరిస్థితి లేదు. పరిస్థితులు సాధారణం రావడంతో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. తమ పెండింగ్ పనులు పూర్తి చేసుకుంటున్నారు. బస్సులు, మెట్రో రైల్‌కు అనుమతి ఇవ్వకపోవడంతో ఆటోలు, క్యాబ్‌లకు డిమాండ్ ఏర్పడింది. దీంతో హైదరాబాద్‌లోని ప్రధాన రహదారులు రద్దీగా కనిపిస్తున్నాయి. అయితే లాక్‌డౌన్, వైరస్ రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు పాటించాలని సీఎం కేసీఆర్ సూచించారు. అందుకనుగుణంగా చర్యలు తీసుకునేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. క్యాబ్‌లు, ఆటోల్లో ప్రయాణిస్తున్న సమయంలో, ముఖ్యంగా బయటకు వచ్చిన సమయంలో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. అయితే మాస్క్ లేనివారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మాస్క్ ఉన్నవారిని మాత్రమే ఆటోలో, క్యాబ్‌లో ఎక్కనిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆటోలు, క్యాబ్‌లు నడుపుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. వారికి చలాన్లు రాస్తున్నారు.