Begin typing your search above and press return to search.
తెలంగాణలో లాక్ డౌన్.. ఆ డేట్ కు సారు ఫిక్స్?
By: Tupaki Desk | 11 May 2021 3:30 AM GMTమహమ్మారికి చెక్ చెప్పేందుకు ప్రజల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నట్లే.. ప్రభుత్వాల పరంగా తీసుకోవాల్సిన చర్యలు ఉంటాయి. భౌతిక దూరం పాటించేలా చూసుకోవటం.. అనవసరమైన రద్దీ చోటు చేసుకోకుండా ఉండటంతో పాటు.. ప్రజలు క్రమశిక్షణగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ.. ఇవేమీ అమలు కాని పరిస్థితి. దీనికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ప్రభుత్వాల పరంగా మహమ్మారి ఛెయిన్ (గొలుసు)ను తెంచేలా వ్యూహాన్ని సరైన సమయంలో అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు లాక్ డౌన్ కు మించింది లేదు.
వైరస్ పుట్టిన వూహాన్ ను లాక్ డౌన్ తో పూర్తిగా స్తంభించిన తర్వాతే.. అక్కడ వైరస్ అదుపులోకి వచ్చిందన్నది మర్చిపోకూడదు. ఈరోజున జీరో కేసులు ఉన్నాయంటే.. అందుకు కారణంగా ముందస్తు చర్యల్ని కఠినంగా అమలు చేయటమే. లాక్ డౌన్ విషయంలో దేశ వ్యాప్తంగా ఒక పాలసీ లేక పోవటం.. కేంద్రం దారిన కేంద్రం.. రాష్ట్రాల దారిన రాష్ట్రాలు ఉండటం.. లాక్ డౌన్ కారణంగా ఏర్పడే ఆర్థిక ఇబ్బందుల్ని తట్టుకునే శక్తి అటు ప్రజల్లోనూ.. ఇటు ప్రభుత్వాల్లోనూ లేకపోవటంతో.. కొంప మునిగే వేళలోనే దాన్ని విధించాలన్న ఆలోచనలకు వచ్చాయి.
తెలంగాణ రాష్ట్రానికి పక్కనున్న ఆంధప్రదేశ్ లో కేసుల తీవ్రతను గుర్తించి.. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అత్యవసర దుఖాణాలు తెరిచి.. ఆ తర్వాత నుంచి పూర్తిగా బంద్ చేసి ఉంచేలా నిర్ణయం తీసుకున్నారు. కానీ.. తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు పరిస్థితులు విషమిస్తుండటం.. అన్ని వైపుల నుంచి వేలెత్తి చూపే పరిస్థితిని ప్రభుత్వం తెచ్చుకోవటంతో.. లాక్ డౌన్ దిశగా ముఖ్యమంత్రి ఆలోచించటం మొదలు పెట్టారు. ఇప్పటికే ఆలస్యమైనట్లు చెబుతున్నా.. మరికొద్ది రోజుల తర్వాత లాక్ డౌన్ విధించే వీలుందంటున్నారు.
ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ నెల 15 నుంచి లాక్ డౌన్ ను అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వినిపిస్తోంది. ఈ డేట్ ను కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. కేసీఆర్ లక్కీ నెంబరు ‘6’.. లాక్ డౌన్ విధిస్తారని చెబుతున్న తేదీ (15)లో ఉండటం గమనార్హం. అయితే.. లాక్ డౌన్ డేట్ కు అది కారణం కాదని.. లాక్ డౌన్ అప్పటికప్పుడు ప్రకటించి.. ప్రజల్లో హడావుడి పెంచే కన్నా.. వారు కాస్త కుదుట పడేలా నాలుగు రోజులు గ్యాప్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. మరి.. ముఖ్యంగా ముస్లింలకు అతి పెద్ద పండుగైన రంజాన్ తర్వాతే లాక్ డౌన్ విధించాలన్న యోచనలో కేసీఆర్ సర్కారు ఉన్నట్లు చెబుతున్నారు.
అంతేకాదు.. లాక్ డౌన్ పూర్తిస్థాయిలోనా? పాక్షికంగానా? వారాంతపు లాక్ డౌనా? లాంటి వాటి విషయాలపై చర్చలు జరపాల్సి ఉందని చెబుతున్నా.. తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో అలాంటివి ఉంటాయా? అన్న మాట కొందరు నేతల నోటి నుంచి వినిపిస్తుండటం గమనార్హం. ఇప్పటికే లాక్ డౌన్ మీద కేసీఆర్ ఒక వాదనను రెఢీ చేసికొని ఉంటారని.. దాన్ని ఆయన మిగిలిన సమక్షంలో వివరిస్తారని.. దాంతో నిర్ణయం తీసుకుంటారన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.