Begin typing your search above and press return to search.

భారత్ లో లాక్ డౌన్ లేకుంటే ఏమయ్యోదో తెలుసా?

By:  Tupaki Desk   |   12 April 2020 5:30 PM GMT
భారత్ లో లాక్ డౌన్ లేకుంటే ఏమయ్యోదో తెలుసా?
X
కరోనా కబళిస్తోంది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తోంది. జనాలు పిట్టల్లా రాలుతున్నారు.. ఇటలీ - అమెరికా - ఇరాన్ - యూరప్ దేశాలు ఆలస్యంగా మేల్కొని ఇప్పుడు వందల చావులను చవిచూస్తున్నాయి.

అదే భారత దేశం ముందే మేల్కొంది. 130 కోట్లు ఉన్న భారత్ లో లాక్ డౌన్ కనుక విధించకుంటా.. విచ్చలవిడిగా ఉంటే ఇప్పటికే శవాల గుట్టలు తయారయ్యేవి. లక్షల మందికి సోకి వేల మంది చనిపోయారు. కానీ అల జరగలేదు.కారణం మన మోడీ సర్కార్ ముందే మేల్కొంది.లాక్ డౌన్ విధించింది.

తాజాగా ఓ నివేదిక కూడా ఇదే విషయాన్ని స్ఫష్టం చేసింది. కరోనా నియంత్రణకు భారత ప్రభుత్వం లాక్ డౌన్, ఇతర ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే భారీ సంఖ్యలో కేసులు పెరగకుండా నిరోధించగలిగామని కేంద్రఆరోగ్య శాఖ తాజాగా సంచలన నివేదికను బయటపెట్టింది.

కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తాజాగా లాక్ డౌన్ కానీ భారత్ లో విధించకపోయింటే ఏప్రిల్ 15నాటికి 8.2 లక్షల కేసులు నమోదయ్యేవని బాంబు పేల్చారు. ఈ మేరకు నివేదికను తెలిపారు. కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలతోనే కేసులను చాలా తగ్గించగలిగామన్నారు.

గణాంకాల ప్రకారం లాక్ డౌన్ ప్రారంభానికి ముందే దేశంలో ఏప్రిల్ 15నాటికి గరిష్టంగా 1.2 లక్షల పాజిటివ్ కేసులు.. 28.9శాతం నమోదై ఉండేవని లవ్ అగర్వాల్ విశ్లేషించారు. ఏప్రిల్ 11కు లాక్ డౌన్ విధిస్తే కనీసం 2 లక్షల కరోనా కేసులు ఉండేవని.. నియంత్రణ చర్యలు తీసుకుంటే 44వేల వరకు పాజిటివ్ కేసులు నమోదై ఉండేవని గణంకాలు తెలుపుతున్నాయన్నారు.

దేశవ్యాప్తంగా 586 ఆస్పత్రులు - లక్ష ఐసోలేషన్ బెడ్లు, వాటిలో 11500 ఐసీయూ బెడ్స్ ఉన్నాయని లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలో 1.7 లక్షల నమూనాలను కరోనా టెస్ట్ చేశారన్నారు. దేశవ్యాప్తంగా ఉమ్మివేయడాన్ని నిషేధించామన్నారు.

ఆదివారం వరకు కేవలం 8వేల కేసులు నమోయద్యయాని.. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ మరిన్ని రోజులు పొడిగించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు లవ్ అగర్వాల్ తెలిపారు.