Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ తో భారీ లాభాలు పొందిన సంస్థలవే..!
By: Tupaki Desk | 26 May 2020 11:30 AM GMTమహమ్మారి వైరస్ ప్రబలడంతో ప్రపంచమంతా ఇంటికే పరిమితమైంది. ఈ వైరస్ ప్రభావంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఈ క్రమంలోనూ కొన్ని కంపెనీలు, సంస్థలు లాభాల బాట పట్టాయి. అయితే కొందరికి లాక్‌డౌన్ భారీగా కలిసొచ్చింది. ఈ సమయంలో లాభాలు, నష్టాలు భారీగా పొందిన సంస్థలు తెలుసుకోండి..
లాక్ డౌన్ లో జూమ్
ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోం విధానం సాఫ్ట్‌వేర్‌తో పాటు అవకాశం ఉన్న ప్రతి రంగం వినియోగిస్తుంది. ఈ క్రమంలో ఉద్యోగులతో మాట్లడడం.. వారు చేస్తున్న పని ఎలా ఉందో తెలుసుకునేందుకు.. ఆన్ లైన్ లోనే మీటింగ్ వంటివి పెట్టడానికి చాలా ఉపయోగపడిన యాప్ జూమ్. ఈ వీడియో కాలింగ్ సాఫ్ట్ వేర్ లాక్ డౌన్ సమయంలో వినియోగం భారీగా పెరిగింది. దీంతో స్టాక్ మార్కెట్ లో విలువ అనూహ్యంగా పెరిగింది. ఈ యాప్ వినియోగదారుల సంఖ్య ఏకంగా కోటి నుంచి 20 కోట్లకు పెరిగింది. ఈ యాప్‌ను ప్రభుత్వాలు, అధికారులు కూడా వినియోగిస్తున్నారు. కొద్దిమంది మొత్తం ఒకేసారి వీడియో కాల్ లో మాట్లాడే అవకాశం ఈ యాప్ లో ఉంది.
టీమ్ వ్యూయర్
లాక్‌డౌన్‌తో పాటు కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అమలుచేశారు. అయితే హఠాత్తుగా ఈ విధానం తీసుకురావడంతో ఉద్యోగులతో కంపెనీకి సంబంధించిన సాఫ్ట్‌వేర్లు, ఫైల్స్ అందుబాటులో లేవు. దీంతో మైక్రోసాఫ్ట్‌కి చెందిన టీమ్ వ్యూయర్ అప్లికేషన్ ను వినియోగించి ఉద్యోగుల సిస్టమ్ - ల్యాప్ టాప్ లలో సాఫ్ట్ వేర్ లు వేయడం.. ఏమైనా సమస్యలు వస్తే ఇంటి నుంచే వారు పరిష్కరించడం వంటివి జరుగుతునాయి. ఈ విధంగా ఆ అప్లికేషన్ ను 4 కోట్ల మంది ఉపయోగించారు. వారంలో యూజర్లు ఏకంగా 40 శాతం మంది పెరిగారని ఆ సంస్థ వెల్లడించింది. రిమోట్ యాక్సిస్ సాఫ్ట్ వేర్ గా పేరున్న టీం వ్యూయర్‌కి లాక్ డౌన్ లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.
దూసుకెళ్లిన స్లాక్
టీమ్ వ్యూయర్ లాంటి ఫీచర్లున్న మరో అప్లికేషన్ “స్లాక్”. ఈ అప్లికేషన్ కు కూడా యూజర్లు భారీగా పెరిగారు. మార్చి నెలాఖరు వరకు తమ అప్లికేషన్ ను వినియోగించే వారి సంఖ్య అమాంతం పెరిగిందని ఆ సంస్థ ప్రకటించింది. రోజురోజుకు సరికొత్త రికార్డులను నెలకొల్పిందని సంస్థ వెల్లడించింది.
లాభాలతో గేమ్స్ పంట పండింది
లాక్ డౌన్ తో ఇంటిల్లిపాది నివాసానికే పరిమితమయ్యారు. పిల్లజెల్ల అందరూ ఇంట్లోనూ ఉంటున్నారు. ఈ సమయంలో పిల్లలతోపాటు పెద్దలు కూడా గేమ్స్‌పై పడ్డారు. ఈ పరిస్థితినే గేమింగ్ పరిశ్రమ సద్వినియోగం చేసుకున్నాయి. గేమ్స్‌ను విపరీతంగా ఆడేయడంతో ఆ గేమ్ కంపెనీలకు భారీగా లాభాలు వచ్చాయి. వాటిలో కొన్ని గేమ్ లు తెగ ఆడేశారు. ఆ కంపెనీలే ఇవి...
యానిమల్ క్రాసింగ్ గేమ్ ఈ లాక్ డౌన్ లో అందరినీ ఆకట్టుకుంది. ఈ గేమ్ లో ఆటగాళ్లను ఓ నిర్మానుష్యమైన ద్వీపం ద్వారం దగ్గరకు తీసుకెళ్తుంది. అనంతరం అక్కడ ఉన్న మాట్లాడే జంతువులతో కూడిన ఓ అందమైన పట్టణాన్ని నిర్మించడమే ఆట. ఈ గేమ్‌ను నింటెండో సంస్థ రూపొందించింది. ఎలాంటి హింసాత్మక ఘటనలు లేకుండా ప్రశాంతంగా ఉండేలా ఈ గేమ్ ఉంది. కొత్త కొత్త డిజైన్లలో ఇళ్లను నిర్మించడాన్ని ఆటగాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ గేమ్ సరికొత్త రికార్డులు సృష్టించనుంది. నింటెండో సంస్థ రూపొందించిన అన్ని వీడియో గేమ్స్‌లో ఈ యానిమల్ క్రాసింగ్ గేమ్ నంబర్ వన్ గేమ్‌గా నిలిచింది. ఏకంగా కోటి 34 లక్షల మదికి పైగా దీన్ని కొనుగోలు చేశారు. ఈ గేమ్‌తో పోటీ పడిన మరో గేమ్ కాల్ ఆఫ్ డ్యూటీ. ఇది కొత్తగా లాంచ్ చేసిన గేమ్. ఇది కోట్లాది మందిని ఆకర్షించింది.vఈ ఏడాదిలో వీడియో గేమ్స్ విక్రయాలు భారీగా పెరిగాయి. సుమారు 35% వరకు పెరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు. వీడియో గేమింగ్ పరిశ్రమ భారీగా పుంజుకుంది.
లాక్ డౌన్ ఓటీటీ ప్లాట్ ఫ్లామ్స్ కు భారీగా కలిసొచ్చింది. ఇంటిల్లిపాది కలిసి సినిమాలు - సిరీస్ లు - షార్ట్ ఫిల్మ్స్ తదితర వంటివి చూశారు. ఈ క్రమంలో ఓటీటీ సంస్థలన్నీ భారీగా లబ్ధి పొందాయి. వీటిలోనే నెట్ ఫ్లిక్స్ నష్టాల నుంచి భారీ లాభాలు పొందింది. ఏకంగా కోటి 60 లక్షల మంది కొత్త వినియోగదారులు ఈ నెట్ ఫ్లిక్స్ లో చేరారు. కంటెంట్ ను భారీస్థాయిలో షూట్ చేసి పెట్టుకోవడంతో ఇప్పుడు ఆ సంస్థకు కలిసొచ్చింది.
డిస్నీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి విజయం సాధించింది. సరైన సమయంలో అడుగుపెట్టి ఆ సంస్థ సత్తా చాటింది. లాక్ డౌన్ ప్రకటించడానికి ముందు డిస్నీకి 3 కోట్ల 30 లక్షల మందికి పైగా వినియోగదారులు ఉండగా రెండు నెలల్లో వారి సంఖ్య 5 కోట్ల 50 లక్షలకు చేరింది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ కు తీవ్రమైన పోటీ ఇచ్చే స్థాయికి చేరింది. ప్రముఖ ఆడియో ఆప్లికేషన్ స్పూటిఫై లాక్ డౌన్ సమయంలో ఏకంగా 13 కోట్ల మంది పెయిడ్ వినియోగదారులను విశేషంగా ఆకర్షించింది. భారీ మొత్తంలో ఆ సంస్థ సంపాదించింది.
ప్రముఖ జిమ్ సంస్థ క్లాస్ పాస్ తన జిమ్‌లన్నింటిని లాక్ డౌన్ నేపథ్యంలో మూసివేసిన పరిస్థితుల్లో ఆన్‌లైన్ తరగతుల్ని మొదలుపెట్టింది. జిమ్‌కు వెళ్లకున్నా ఆన్ లైన్ తరగతులు తీసుకుని జిమ్‌లో ఉన్నట్టు వినియోగదారులకు సూచనలు ఇస్తూ వారి వ్యాయామం క్రమం తప్పకుండా చర్యలు తీసుకుంది. తాము కొత్తగా ప్రారంభించిన వెంచర్ కు విపరీతమైన డిమాండ్ వచ్చిందని ఆ సంస్థ తెలిపింది. పెలొటన్ సంస్థ కూడా వీడియో స్ట్రీమింగ్ క్లాసుల్ని ప్రారంభించి లాభాలు పొందింది.