Begin typing your search above and press return to search.

ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తేసే ఆలోచన లేదు:మోదీ!

By:  Tupaki Desk   |   8 April 2020 11:50 AM GMT
ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తేసే ఆలోచన లేదు:మోదీ!
X
కరోనా వైరస్ .. ప్రస్తుతం దేశాన్ని అల్లకల్లోలం చేస్తుంది. ఈ కరోనాను అరికట్టడంలో భాగంగా కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను విధించాయి. ఈ లాక్ డౌన్ గడువు ఏప్రిల్ 14 కి ముగియబోతుంది. ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్‌ ను ఏప్రిల్ 14వ తేదీన ఎత్తేసే యోచన లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం రోజు దేశంలోని అన్ని పార్టీల పార్లమెంటరీ నేతల వీడియో కాన్ఫరెన్స్ లో మోదీ ఈ వ్యాఖ్యలు చేసారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను పొడగించే ఆలోచనలోనే కేంద్రం ఉన్నట్లు కనిపిస్తుంది.

ఈ అఖిలపక్షం సమావేశంలో లాక్ డౌన్ ఎత్తివేతపై పలువురు పలు రకాల సలహాలు - సూచనలు చేసినప్పటికీ.. మెజారిటీ పక్షాలు లాక్ డౌన్ కొనసాగింపునకే మొగ్గు చూపాయి. ఈ భేటీలో పరోక్షంగా ఏప్రిల్ 14 తరువాత లాక్ డౌన్ ఎత్తివేయలేం అని హింట్ ఇచ్చారు. లాక్ డౌన్ ఎత్తేయాలా - కొనసాగించాలా అనే విషయంపై శనివారం ముఖ్యమంత్రులతో చర్చించిన తర్వాతనే మోడీ తుది నిర్ణయం తీసుకుంటారు అని సమాచారం.

కరోనా తర్వాత పరిస్థితులు మునుపటిలాగా సాధారణంగా ఉండవని - కరోనాకు ముందు - కరోనాకు తరువాత అనే రకంగా పరిస్థితి ఉంటుందని మోదీ చెప్పారు. ఈక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వైసీపీ - టీఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీలు పరస్పరం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసాయి. లాక్ డౌన్‌ ను కనీసం మరో రెండు వారాల పాటు కొనసాగించాలని టీఆర్ ఎస్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే.. కరోనా కేసులు లేని చోట్ల లాక్ డౌన్‌ ను ఎత్తివేసి.. హాట్ స్పాట్లలో మరింత పకడ్బండీగా లాక్ డౌన్ కొనసాగించాలని ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రధాన మంత్రిని కోరింది. కరోనావైరస్ నానాటికీ విస్తరిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5,360కు చేరుకుంది.