Begin typing your search above and press return to search.

తెలంగాణలో మే 7వరకు లాక్ డౌన్ !!

By:  Tupaki Desk   |   19 April 2020 12:52 PM GMT
తెలంగాణలో మే 7వరకు లాక్ డౌన్ !!
X
రేపటి నుంచి కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో అది ఎంతవరకు సాధ్యం అనే అంశంతో పలు ఇతర కీలక విషయాలపై చర్చించడం కోసం ఈరోజు తెలంగాణ కేబినెట్ సమావేశం పెట్టిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఒక కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని అర్థమవుతోంది. దేశ వ్యాప్తంగా మే 3వరకు మాత్రమే కేంద్రం లాక్ డౌన్ పెట్టగా... తెలంగాణలో దానిని మే 7 వరకే పొడిగించే అంశాన్ని కేబినెట్ ముందు పెట్టారు ముఖ్యమంత్రి. మే 7 లోపు ఇప్పటివరకు నమోదు చేసిన కంటైన్ మెంట్ జోన్స్ 14 డేస్ ఐసోలేషన్ కూడా అప్పటి లోపు పూర్తి చేసుకుంటాయి. కొత్తవి ఏవైనా వస్తే... వాటిని మాత్రమే సపరేట్ గా పర్యవేక్షించొచ్చని ఈ ఆలోచన చేసినట్లు అర్థమవుతుంది.

లాక్ డౌన్ పీరియడ్ లో ప్రస్తుతం ఆపరేట్ అవుతున్న ఫుడ్ డెలివరీ మినహా ఇతర ఏ ఆన్ లైన్ డోర్ డెలివరీ కూడా లాక్ డౌన్ పీరియడ్లో అనుమతించకూడదని తెలంగాణ సర్కారు ఈ కేబినెట్లో నిర్ణయించే అవకాశం కూడా కనిపిస్తోంది.

ఇదిలా ఉండగా... అద్దె ఇళ్లలో ఉండే వారికి కూడా ప్రభుత్వం తరఫున కొంత వెసులు బాటు కల్పించే అంశాన్ని కేబినెట్లో చర్చిస్తున్నారు. మార్చి అద్దెతో కలుపుకుని మూడు నెలల పాటు టెనెంట్లను అద్దె అడగరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే... ఇది మళ్లీ వసూలు చేసేకోవాలా? లేదా ? అనే దానిపై మంత్రి వర్గం సమావేశంలో క్లారిటీగా చర్చించనున్నారు. అయితే, ఈ అద్దెల విషయం ఓన్లీ గృహాలను (కమర్షియల్ కాకుండా) మాత్రమే దృష్టిలో పెట్టుకుని చర్చిస్తున్నారు. మంత్రి వర్గ సమావేశం అనంతరం వీటిని ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది.