Begin typing your search above and press return to search.
మే 3 తర్వాత లాక్ డౌన్ పొడిగింపు?
By: Tupaki Desk | 23 April 2020 9:30 AM GMTలాక్ డౌన్ కు అంతం ఎప్పుడు? ఎప్పుడు లాక్ డౌన్ ఎత్తివేస్తారు? జనాలను ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఇప్పుడు ఇదే టాపిక్ దేశ ప్రజలందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. పరిస్థితి చూస్తుంటే లాక్ డౌన్ మే 3తో అంతం అయ్యేలా కనిపించడం లేదు.
మొదటి విడత లాక్ డౌన్ ప్రకటనకు ముందు భారత్ లో కరోనా కేసులు కేవలం దాదాపు 500గా ఉండేవి. ఏప్రిల్ 14వరకు విధించిన లాక్ డౌన్ లో 10వేలు దాటాయి. అంటే సరాసరి 20 రెట్లు కేసులు నమోదయ్యాయి. ఇది టూమచ్ కరోనా వ్యాప్తి. అందుకే మే 3వరకు ప్రధాని నరేంద్రమోడీ లాక్ డౌన్ పొడిగించారు. ఈ 10 రోజుల్లోనే కరోనా కేసులు దేశంలో 20వేలు దాటాయి. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. మరి ఇంకా ఏం చేయాలి?
లాక్ డౌన్ వల్ల దేశంలో కరోనా వ్యాప్తి తగ్గి.. కేసుల నమోదు తగ్గుతుందని కేంద్రం ఆశించింది. కానీ కొత్త కేసులు అంతకంతకూ పెరుగుతుండడం.. వ్యాప్తిని నిరోధించడంలో కేంద్రం, రాష్ట్రాలు విఫలమవుతూనే ఉన్నాయి.
తాజాగా మే 3 నుంచి దేశీయ విమాన ప్రయాణాలను అనుమతించారు. జూన్ 1 నుంచి విదేశీ ప్రయాణాలకు అనుమతులిచ్చారు. దీంతో టికెట్ల అమ్మకాలను ఎయిర్ లైన్స్ సంస్థలు మొదలుపెట్టాయి. కానీ అనూహ్యంగా భారత ప్రభుత్వం టికెట్ల అమ్మకాలు ఆపేయండంటూ దేశ, విదేశీ విమానయాన సంస్థలను ఆదేశించింది.
ప్రధాని మోడీ ఈ నెల 27న మరోసారి రాష్ట్రాల సీఎంలతో భేటి కాబోతున్నారు. లాక్ డౌన్ గడువు పొడిగించాలా వద్దా అనేదానిపై ఈ సమావేశం తర్వాత అభిప్రాయాలు తీసుకొని మోడీ నిర్ణయిస్తారు. అయితే ఇదివరకు రెండు సార్లు మీటింగ్ తర్వాత మోడీ లాక్ డౌన్ పొడిగించారు. ఇప్పుడు కూడా మే నెలాఖరు వరకు పొడిగించడం ఖాయమని తెలుస్తోంది. జూన్ 1 వరకు లాక్ డౌన్ పొడిగిస్తారని తెలుస్తోంది.
కరోనా కేసులు తగ్గితే లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశం ఉంది. కానీ రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో తగ్గినా కూడా మళ్లీ పెరుగుతున్నాయి. ఎటునుంచి ఎక్కడ వైరస్ అంటుతుందో తెలియని పరిస్థితి. అందుకే లాక్ డౌన్ ఎత్తేస్తే మరింత ప్రమాదం సో.. పొడిగించవచ్చని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్ తర్జనబర్జన పడుతున్న కేంద్రం తాజాగా మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ పొడిగించే అవకాశాలున్నట్టు కనిపిస్తోంది. కేసుల సంఖ్య ఇలానే పెరిగితే మే చివరి వరకు కూడా లాక్ డౌన్ పొడిగించడం తప్ప కేంద్రానికి మరో మార్గం లేకుండా పోయే అవకాశం ఉంటుంది. కేంద్రం కూడా ఇదే ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే దేశంలో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంటుంది.