Begin typing your search above and press return to search.
ఢిల్లీలో లాక్ డౌన్ ప్రచారం ఫేక్.. మహారాష్ట్రలో మాత్రం పెట్టే ఛాన్స్?
By: Tupaki Desk | 29 March 2021 4:39 AM GMTచూస్తుండగానే దేశంలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నయి. మొన్నటివరకు రోజుకు పాతిక వేల లోపే ఉన్న కేసులు ఈ మధ్యన నలభై వేలకు చేరుకోవటం.. తాజాగా 60 వేలకు చేరుకోవటం చూస్తే.. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం కలుగక మానదు. దేశ రాజధానిలో గడిచిన 24 గంటల్లో 2వేల వరకు కేసులు కొత్తగా నమోదైతే.. ఏపీలో వెయ్యికి పైనే నమోదవుతున్నాయి. తెలంగాణలోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో.. లాక్ డౌన్ మీద ప్రచారం జోరుగా సాగుతోంది.
ఆదివారం మొత్తం దేశ రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్ విధించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగింది. దీనికి సంబంధించిన పలు వార్తా క్లిప్పింగులు వైరల్ అయ్యాయి. అయితే.. అవన్నీ ఫేక్ గా తేల్చేశారు. ఇదిలా ఉంటే.. లాక్ డౌన్ కు సానుకూలంగా ఏ రాష్ట్రం ప్రస్తుతానికైతే లేదు. అయితే.. ఈ అంశంపై కాస్త భిన్నంగా స్పందించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతూ.. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధిక భాగం మహారాష్ట్రలోనే కావటంతో.. లాక్ డౌన్ తప్పదన్న భావన వ్యక్తమవుతోంది.
ఈ వాదనకు బలం చేకూరేలా మహారాష్ట్ర సీఎం నోట కీలక వ్యాఖ్యలు వచ్చాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికి కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. ఆదివారం అధికారులతో సమావేశమైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి.. అవసరమైతే ప్రభుత్వం లాక్ డౌన్ ఆప్షన్ ఎంపిక చేసుకోక తప్పేలా లేదన్నట్లు చెప్పినట్లు సమాచారం. అయితే.. ఈసారి లాక్ డౌన్ ఆర్థికంగా నష్టపోకుండా ప్రణాళికను సిద్ధం చేయాల్సిందిగా అధికారుల్ని సూచించినట్లు చెబుతున్నారు. మొత్తంగా మహారాష్ట్ర లాక్ డౌన్ కు సిద్ధంగా ఉండాలన్న మాట మహారాష్ట్ర ముఖ్యమంత్రి నోటి వెంట రావటం గమనార్హం.