Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ కు అసలు కారకులు వారే?

By:  Tupaki Desk   |   18 July 2020 2:30 PM GMT
లాక్ డౌన్ కు అసలు కారకులు వారే?
X
కర్ణాటక రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. విపరీతంగా వ్యాపిస్తోంది. కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొందరు వ్యక్తులు క్వారంటైన్ నుంచి తప్పించుకునేందుకు తప్పుడు చిరునామాలు ఇచ్చి అధికారులను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ కారణంగానే కర్ణాటకలో వైరస్ ప్రబలుతోందని అధికారులు గుర్తించారు.

కర్ణాటకలో భారీగా పాజిటివ్ కేసుల వెనుక కారణం చాలా మంది క్వారంటైన్ లో ఉండేందుకు తప్పుడు అడ్రస్ లు ఇవ్వడమే.. వారంతా ఆయా ప్రాంతాల్లో లేక బయట తిరుగుతుండడంతో వైరస్ బాగా వ్యాపిస్తోంది.

ప్రస్తుతం కర్ణాటకలో బెంగళూరుతోపాటు మరో 12 జిల్లాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వచ్చే వారు 14రోజులు హోం క్వారంటైన్ లో ఉండాలని నిబంధనలున్నాయి. అయితే కొందరు నిర్లక్ష్యంతో తప్పుడు వివరాలు ఇవ్వడంతో వారిని గుర్తించడం అధికారులకు కష్టమవుతోంది.

కర్ణాటకలో ఇలా 23వేల మంది వివరాలు తప్పుగా ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. క్వారంటైన్ లో ఉంటామని తప్పుడు వివరాలు ఇవ్వడంతో వారి వల్ల కర్ణాటకలో వైరస్ బాగా వ్యాపిస్తోంది. మొత్తం 69297మంది హోం క్వారంటైన్ లో ఉంటామని చిరునామాలు ఇవ్వగా అందులో 23184మంది తప్పుడు వివరాలు ఇచ్చినట్టు గుర్తించారు. వీరి వల్ల కరోనా తీవ్రంగా ప్రబలుతుండడంతో కర్ణాటకలో లాక్ డౌన్ విధించినట్టు తెలిసింది.