Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: ఎంపీల వేతనాల తగ్గింపు

By:  Tupaki Desk   |   15 Sep 2020 4:30 PM GMT
బ్రేకింగ్: ఎంపీల వేతనాల తగ్గింపు
X
మన ప్రజాప్రతినిధులు జీతాలు తగ్గించుకున్నారు. కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం గోస చూసి ఓ 30 శాతం కట్ చేసుకొని ఉదారత చాటుకున్నారు. ఎప్పుడూ పెంచుకునేదే తప్పితే దించుకోవడం తెలియని ఎంపీలు ఫస్ట్ టైం కరోనా వల్ల జీతాలు తగ్గించుకోవడం విశేషం.

పార్లమెంట్ సభ్యుల వేతనంలో 30శాతం కోత విధించే బిల్లును లోక్ సభ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. కరోనాతో తలెత్తిన అవసరాలను తీర్చే క్రమంలో ఎంపీల వేతనాల్లో రెండేళ్ల పాటు కోత విదిస్తూ పార్లమెంట్ సభ్యుల వేతనాలు, పెన్షన్ సవరణ బిల్లు-2020ను లోక్ సభలో ప్రవేశ పెట్టగా ఆమోదం లభించింది.

సాధారణంగా ఎంపీలకు వేతనాల రూపంలో నెలకు రూ. లక్ష అందాల్సి ఉంటుంది. లోక్ సభలో 543, రాజ్యసభలో 245 మంది సభ్యులున్నారు. ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఏప్రిల్ రూ.70 వేలు మాత్రమే ఎంపీలు వేతనంగా పొందుతున్నారు.

మరోవైపు పార్లమెంట్ లో డీజీసీఏ, ఏఏఐబీ, బీసీఏఎస్ లకు చట్టపరమైన అధికారాలను కల్పించే ఎయిర్ క్రాఫ్ట్ సవరణ బిల్లుకు కూడా రాజ్యసభ ఆమోదం పొందడం పట్ల పౌరవిమానాయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఆమోదంతో భారత పౌరవిమానయాన రంగంలో భద్రత మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం అవుతాయని ఆయన పేర్కొన్నారు.

కాగా భారత చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చల్లారలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సభలో తెలిపారు. సంప్రదింపులకు సిద్దంగా ఉన్నా చైనా నిరాకరిస్తోందని అన్నారు. దేశ సైన్యం వెంటే తాము ఉన్నామని తెలిపారు.