Begin typing your search above and press return to search.
ఆ కక్కుర్తే ఆ ఎంపీ కొంపముంచింది
By: Tupaki Desk | 1 May 2017 10:27 AM GMTఅందం ఎరవేసి, అల్లుకుపోతూ మాట్లాడి ఓ కిలాడీ లేడీ ఏకంగా పార్లమెంటు సభ్యుడొకరిని తన ముగ్గులోకి దింపింది. ఆ తరువాత ఆయన్ను తన ఇంటికి తీసుకెళ్లి మత్తుమందు కలిపిన కూల్ డ్రింకు ఇచ్చింది. ఆ తరువాత పడకగదిలోకి తీసుకుని బట్టలూడదీసి వీడియో తీసింది. ఇప్పుడా వీడియోలు చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజుతోంది. దీంతో ఆయన చివరకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.
ఢిల్లీలోని ఓ ఎంపీ వద్దకు ఓ మహిళ సాయం కోసం వచ్చింది. ఆ తర్వాత ఆమె చెప్పిన తీయని మాటలకు ఆ ఎంపీ లొంగిపోయాడు. ఆ తర్వాత ఘజియాబాద్‌లోని తన ఇంటికి పిలిచింది. అక్కడ కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి ఇచ్చింది. దాన్ని సేవించగానే ఆ ఎంపీ మత్తులోకి జారుకున్నారు. ఆ తర్వాత తాను అనుకున్న పనిని ఆ మహిళ పూర్తి చేసింది. ముఖ్యంగా ఎంపీతో సన్నిహితంగా ఉన్నట్లు అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియో తీసింది. ఈ వీడియో, ఫోటోలు చూపించి రూ.5 కోట్లు ఇవ్వాలని లేకుంటే అత్యాచారం కేసు పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేసింది. ఈ వేధింపులు తట్టుకోలేని ఆ ఎంపీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎంపీ ఫిర్యాదుపై తాము ఐపీసీ సెక్షన్ 384 కింద కేసు నమోదు చేసి, ప్రత్యేక క్రైం బ్రాంచ్ బృందంతో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ మహిళ కోసం పోలీసులు వెతుకుతున్నారు. కాగా ఈమె గత ఏడాది కూడా ఇంకో ఎంపీపై ఇలాగే అత్యాచారం కేసు పెట్టిందట. అయినా... అనుకోవడం కానీ మన ఎంపీలు కక్కుర్తి పడకుండా ఉంటే ఇంతవరకు ఎందుకు వస్తుంది.?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/