Begin typing your search above and press return to search.

ఆధార్’ చట్టంగా మారితే ఏం జరుగుతుంది?

By:  Tupaki Desk   |   12 March 2016 5:56 AM GMT
ఆధార్’ చట్టంగా మారితే ఏం జరుగుతుంది?
X
ఒక కీలక బిల్లును శుక్రవారం లోక్ సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందితే ఇది కాస్తా చట్టంగా మారనుంది. ఇంతకీ ఈ కీలక బిల్లును సింఫుల్ గా.. అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఆధార్ కు చట్టబద్ధత కల్పించటం. ఇవాల్టి రోజున దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికి (దాదాపుగా) ఆధార్ కార్డులు ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరికి ఆధార్ కార్డు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు కానీ.. రాజ్యసభలో పాస్ అయి చట్టంగా మారితే ఏం జరుగుతుంది? ఎలాంటి లాభం చేకూరుతుంది? అన్న ప్రశ్నల్లోకి వెళితే..

తొలుత ఆధార్ చట్టంగా మారితే ఏమవుతుందో చూస్తే..

= ఆధార్ చట్టబద్ధం అయితే.. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు తాము అమలు చేసే ప్రతి పథకాన్ని ఆధార్ తో లింకు చేస్తాయి.

= ఈ లింక్ తో అనర్హులకు ప్రభుత్వ పథకాలు అందకుండా పోతాయి.

= ప్రభుత్వ పథకాలకు ఆధార్ లింకేజీ ఉండటంతో అనర్హులకు దక్కని నేపథ్యంలో ఖర్చు తగ్గుతుంది.

= అదే జరిగితే సంక్షేమం కోసం ప్రభుత్వం మీద పడుతున్న ఒత్తిడి తగ్గుతుంది

= అంతిమంగా కొత్త పన్నుల మోత తగ్గే అవకాశం ఉంది

= లక్షిత వర్గాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనం అందటం ద్వారా ఆయా వర్గాల బతుకుల్లో మార్పులు రావటం ఖాయం

= ఇప్పుడు అనుసరిస్తున్న విధానాల్లో ప్రభుత్వ పథకాలకు అర్హత లేకున్నా వాటిని ఏదో ఒక కోణంలో పొందుతున్నారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకానికి ఆధార్ లింకేజీని చట్టబద్ధం చేయటం ద్వారా.. ఆక్రమాలకు దాదాపుగా చెక్ చెప్పినట్లు కావటం ఖాయం.