Begin typing your search above and press return to search.
తప్పుడు యాడ్స్: కంపెనీలు, ప్రముఖులు బుక్కే
By: Tupaki Desk | 31 July 2019 10:49 AM GMTకోహ్లీ చెప్పాడని చిప్ప్ కొని తింటాం.. మహేష్ తాగాడని థమ్సప్ ను అదే పనిగా ఆయన ఫ్యాన్స్ తాగుతుంటారు. హీరోయిన్ రాసుకుందని ఆ సబ్బునే వాడుతాం.. యాడ్స్ లో కనిపించే వాళ్లకు కోట్లు ఇచ్చి మనదగ్గర కోట్లు కొల్లగొడుతారు. ఆకర్షించే ప్రకటనలు టీవీల్లో పేపర్లలో అన్నీ ఇన్నీ కావు. నాణ్యతలేకున్నా, అవి హానీ చేస్తాయని తెలిసినా వాడుతుంటాం. కానీ ఇక నుంచి వినియోగదారులను మోసం చేసే తయారీ కంపెనీలే కాదు.. ప్రకటనల్లో నటించే వాళ్లకు గట్టి శిక్ష పడేలా కేంద్రం కొత్త చట్టం తెస్తోంది.
టీవీ చూసినా.. పేపర్ చూసినా.. సెల్ ఫోన్ చూసినా ఒకటే యాడ్స్.. అవే ప్రకటనలు.. మనల్ని ఆకర్షించేలా ఉంటాయి. చూడగానే కొనేయాలనిపిస్తుంది. తీరా కొన్నాక టీవీలో చూసిన దానికి మన దగ్గర ఉన్నదానికి పొంతనే ఉండదు. ఇలాంటి తప్పుడు ప్రకటనలు రూపొందించే కంపెనీల ఆగడాలకు చెక్ పెట్టేందుకు తాజాగా కేంద్రం సిద్ధమైంది. ఇందుకోసం ‘ది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బిల్ -2019’ను తీసుకొచ్చింది. లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభలో కూడా ఆమోదం పొందితే ఇక ప్రకటన దారులు, తయారీదారులు, సర్వీస్ ప్రొవైడర్లు, చివరకు యాడ్స్ లో నటించే సెలెబ్రెటీలు సైతం బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడబోతోంది.
‘ది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బిల్ -2019’ ప్రకారం టీవీ, రేడియో, ప్రింట్, ఎలక్ట్రానిక్, ఔట్ డోర్ యాడ్స్, ఈకామర్స్, టెలిమార్కెటింగ్ ఇలా ఏ మాధ్యమంలోనైనా తప్పుడు ప్రకటనలు ఇస్తే శిక్షార్హులవుతారు. కంపెనీల మోసాలకు బలవ్వకుండా ఈ బిల్లును కఠినంగా రూపొందించారు. ఫలితంగా వినియోగదారులు మోసపోకుండా కేంద్రం చట్టం ద్వారా రక్షణ కల్పిస్తోంది.
ఈ బిల్లు చట్టం రూపం దాల్చితే ఢిల్లీ కేంద్రంగా చీఫ్ కమిషనర్ ఆధ్వర్యంలో సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఆథారిటీ ఏర్పాటు అవుతుంది. ఇది వినియోగదారుల హక్కులు, తప్పుడు వ్యాపార విధానాలు, మోసపూరిత అడ్వటైజ్ మెంట్లను సంస్థ పర్యవేక్షించి తప్పు చేసిన కంపెనీలు, సర్వీస్ ప్రొవైడ్ దారులకు 2 ఏళ్ల జైలు శిక్షతోపాటు 10 లక్షల జరిమానా విధించేలా కఠిన చట్టం రూపొందించారు. నటించే సెలబ్రెటీలకు 10 లక్షల పెనాల్టీ విధిస్తారు. మళ్లీ తప్పు చేస్తే 50 లక్షల జరిమానా ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. సదురు సెలబ్రెటీపై ఏడాది వరకు యాడ్స్ లో నటించకుండా నిషేధం విధిస్తారు.
ఇటీవల వివిధ బ్రాండ్లకు అంబాసిడర్లకు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదైన చర్యలు ఏమీ లేవు. దీనిపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థ క్యూనెట్ మోసం వ్యవహారంలో ఇప్పటికే షారుఖ్ ఖాన్, పూజా హెగ్డే, అల్లు శిరీష్, యువరాజ్ సింగ్ లు ప్రచారం చేశారు. వారు నోటీసులు అందుకున్నారు. ఇటీవల ఆమ్రాపాలీ రియల్ వెంచర్లో ఎంఎస్ ధోని సంస్థకు నోటీసులు వెళ్లాయి. ఇప్పుడు ఇలా మోసం చేసే తప్పుగా వ్యవహరించే సంస్థలకు ప్రచారం చేసే సెలెబ్రెటీలు జైలు శిక్ష పడే జాబితాలో చేరుతారు. సో కఠినమైన ఈ చట్టం వినియోగదారుల పాలిట వరంగా మారింది.