Begin typing your search above and press return to search.

ఐదోసారి స‌భ వాయిదా.. అవిశ్వాస చ‌ర్చ లేన‌ట్లే

By:  Tupaki Desk   |   22 March 2018 9:56 AM GMT
ఐదోసారి స‌భ వాయిదా.. అవిశ్వాస చ‌ర్చ లేన‌ట్లే
X
అధికార‌ప‌క్షం అనుకోవాలే కానీ ఏమైనా చేయొచ్చ‌న్న విష‌యం మ‌రోసారి రుజువైంది. మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్ట‌టం ద్వారా ఏపీ ప్ర‌త్యేక హోదా అంశంపై ఏన్డీయే స‌ర్కారు ద్రోహాన్ని ప్ర‌జ‌ల‌కు తెలిసేలా చేయాల‌న్న ప్లాన్ వైఎస్సార్ కాంగ్రెస్‌.. టీడీపీ వేస్తే.. అందుకు కౌంట‌ర్ ప్లాన్ ను బీజేపీ వేసింద‌ని చెప్పాలి.

కేవ‌లం రెండు ప్రాంతీయ పార్టీల‌కు చెందిన కొంత‌మంది ఎంపీల సాయంతో ఆందోళ‌న జ‌రిపించి.. స‌భ‌ను వాయిదా వేయ‌టం షురూ చేశారు. హోదా సాధ‌న కోసం అవిశ్వాసం పెడుతున్న పార్టీల‌కు చిరాకు పుట్టించేలా సేమ్ ఓల్డ్ ప్లాన్ ను ఈ రోజు అమ‌లు చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

గురువారం లోక్ స‌భ స్టార్ట్ కాగానే.. టీఆర్ ఎస్‌.. అన్నాడీఎంకే ఎంపీలు వెల్ లోకి వెళ్లి వారి డిమాండ్ల సాధ‌న కోసం గ‌ళం విప్పారు.దీంతో 30 సెకండ్ల వ్య‌వ‌ధిలోనే స‌భ‌ను వాయిదా వేశారు. అనంత‌రం పన్నెండు గంట‌ల వేళ‌లో మ‌రోసారి స‌భ కొలువు దీరింది. ఈసారి ఎప్ప‌టిలానే టీఆర్ఎస్‌.. అన్నాడీఎంకే ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లి నిర‌స‌న‌లు షురూ చేశారు. మ‌రోవైపు అనంత‌కుమార్ మాట్లాడుతూ.. స‌భ‌లో ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం స్పీక‌ర్ టేబుల్ మీద ఉంద‌ని.. స‌భ ఆర్డ‌ర్ లో ఉంటే అవిశ్వాసంపై చ‌ర్చ స్టార్ట్ చేస్తామ‌న్నారు.

ఇందుకు స‌భ్యులంతా స‌హ‌క‌రించాల‌న్నారు. అనంత‌కుమార్ మాట‌ల‌కు ఆందోళ‌న చేస్తున్న అన్నాడీఎంకే.. టీఆర్ ఎస్ ఎంపీలు స్పందించ‌లేదు. గంద‌ర‌గోళంగా స‌భ ఉన్న‌ప్పుడు అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌ను చేప‌ట్ట‌లేమ‌ని స్పీక‌ర్ చెబుతూ.. గ‌డిచిన నాలుగు ద‌ఫాలుగా ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నారో.. ఈ రోజూ అదే నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించి శుక్ర‌వారానికి స‌భ‌ను వాయిదా వేసి వెళ్లిపోయారు. మొద‌టిసారి 30 సెకండ్లు స‌భ జ‌ర‌గ్గా.. ప‌న్నెండు గంట‌ల స‌మ‌యంలో స‌భ కొలువు తీరినప్పుడు మూడు నిమిషాల పాటు స‌భ జ‌ర‌గ‌టం గ‌మ‌నార్హం.