Begin typing your search above and press return to search.

18 ఏళ్ల రికార్డును బ‌ద్ధ‌లు కొట్టిన మోడీ స‌ర్కార్!

By:  Tupaki Desk   |   13 July 2019 4:52 AM GMT
18 ఏళ్ల రికార్డును బ‌ద్ధ‌లు కొట్టిన మోడీ స‌ర్కార్!
X
ఎలాంటి ప్ర‌త్యేక‌త‌లు లేవు. అయిన‌ప్ప‌టికి అర్థ‌రాత్రి వ‌ర‌కూ సాగిన లోక్ స‌భ‌లో సుదీర్ఘ చ‌ర్చ జ‌రిగింది. దీంతో 18 ఏళ్ల రికార్డు బ‌ద్ధ‌లైంది. అనూహ్యంగా గురువారం లోక్ స‌భ అర్థ‌రాత్రి వ‌ర‌కూ సాగింది. ప్ర‌చార మాధ్య‌మాల్లో దీనికి సంబంధించిన వార్త పెద్ద‌గా ఫోక‌స్ కాలేదు. ఈ ప‌రిణామంతో 18 ఏళ్ల నాటి రికార్డును బ‌ద్ధ‌లు కొట్టిన ఘ‌న‌త మోడీ స‌ర్కారుకు ల‌భించింది.

ఇంత‌కూ ఎందుకిలా జ‌రిగింది? ఎందుకంటే సుదీర్ఘంగా స‌భ‌ను సాగించారు? ఏ చ‌ర్చ దీనికి కార‌ణ‌మైంది? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు వెతికితే.. రైల్వేశాఖ‌కు గ్రాంట్ల‌పై చ‌ర్చ గురువారం మ‌ధ్యాహ్నం మొద‌లైంది. చ‌ర్చను అదే రోజు ముగించాల‌ని నిర్ణ‌యించారు. ఇందులో భాగంగా గంట‌ల కొద్దీ చ‌ర్చ ఈ సంద‌ర్భంగా సాగింది.

రైల్వే సేవ‌ల‌ను మెరుగుప‌ర్చాల్సింది పోయి.. రైల్వే ఆస్తుల‌ను మోడీ స‌ర్కారు అమ్మేసే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లుగా ప్ర‌తిప‌క్ష స‌భ్యులు ఆరోపించ‌గా.. అలాంటిదేమీ లేద‌ని వారి ఆరోప‌ణ‌ల్ని తిప్పి కొట్టే ప్ర‌య‌త్నం చేసింది మోడీ స‌ర్కారు. యూపీఏ స‌ర్కారుతో పోలిస్తే మోడీ స‌ర్కారు హ‌యాంలో రైల్వేల ప‌ని తీరు మ‌రింత మెరుగుప‌డిన‌ట్లుగా బీజేపీ ఎంపీ సునీల్ కుమార్ సింగ్ బ‌దులిచ్చారు.

గ‌డిచిన ఐదేళ్ల‌లో మోడీ ప్ర‌భుత్వ పాల‌న‌లో రైలు ప్ర‌మాదాల సంఖ్య 73 శాతానికి త‌గ్గిన‌ట్లుగా చెప్పారు. అర్థ‌రాత్రి 11.58 గంట‌ల పాటు లోక్ స‌భ జ‌ర‌గ‌టంతో ఒక రికార్డు బ‌ద్ధ‌లైంది. గ‌డిచిన 18 ఏళ్ల‌లో ఇంత సుదీర్ఘంగా స‌భ సాగ‌లేద‌ని.. 18 ఏళ్ల క్రితం ఒక‌సారి జ‌రిగిన‌ట్లుగా పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రి ప్ర‌హ్లాద్ జోషి పేర్కొన్నారు. మామూలు వేళ‌ల్లో స‌భ జ‌రిగితేనే స‌భ‌లో పెద్ద‌గా స‌భ్యులు ఉండ‌రు.. మ‌రి అర్థ‌రాత్రి వేళ వ‌ర‌కూ సాగిన చ‌ర్చ‌లో ఎంత‌మంది ఎంపీలు ఉన్నారేంట‌న్న సందేహానికి స‌మాధానం వెతికితే వంద మంది అన్న జ‌వాబు వ‌స్తుంది. ఆ స‌మ‌యానికి కూడా అంత మంది ఎంపీలు ఉండ‌టం విశేషంగా చెప్ప‌క త‌ప్ప‌దు.