Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ఎంపీల్ని స్పీక‌ర్ అవ‌మానించారా?

By:  Tupaki Desk   |   23 March 2018 10:17 AM GMT
జ‌గ‌న్ ఎంపీల్ని స్పీక‌ర్ అవ‌మానించారా?
X
ఆరు రోజులుగా మోడీ స‌ర్కారుపై ఏపీ విప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ (అధికార ప‌క్షం కూడా) అవిశ్వాస తీర్మానాన్ని పెడుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌డిచిన ఐదు రోజులుగా ఏ రీతిలో అయితే.. స‌భ కొలువు తీర‌టం.. కాసేప‌టికే వాయిదా ప‌డ‌టం.. మ‌ళ్లీ కాసేప‌టికే ప‌క్క‌రోజుకు వాయిదా ప‌డ‌టం తెలిసిందే.

ఆరో రోజైన శుక్ర‌వారం కూడా సేమ్ టు సేమ్ అన్న‌ట్లుగా సాగింది. గ‌డిచిన ఐదు రోజులుగా ఏ రీతిలో అయితే.. స‌భ స్టార్ట్ కావ‌టం.. ఆ త‌ర్వాత వాయిదా ప‌డ‌టం.. తిరిగి స‌భ ప్రారంభ‌మై మ‌ళ్లీ వాయిదా ప‌డే రీతిలోనూ శుక్ర‌వాం జ‌రిగింది. కాకుంటే.. స‌భ కొన్ని నిమిషాల పాటు సాగ‌టం ఈ రోజు ప్ర‌త్యేక‌త‌గా చెప్పాలి. శుక్ర‌వారం తొలుత స‌భ కొలువు తీరిన త‌ర్వాత మూడు నిమిషాల పాటు సాగ‌గా.. వాయిదా ప‌డి రెండోసారి స‌భ స్టార్ట్ అయ్యాక తొమ్మిది నిమిషాల పాటు సాగింది. ఎప్ప‌టిలానే అన్నాడీఎంకే.. టీఆర్ ఎస్ స‌భ్యులు స‌భ జ‌ర‌గ‌కుండా వెల్ లోకి దూసుకెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

కావేరీ అంశంపై అన్నాడీఎంకే.. రిజ‌ర్వేష‌న్ల విష‌యంపై టీఆర్ ఎస్ ఎంపీలు ఆందోళ‌న చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. స‌భ అదుపులోకి రాక‌పోవ‌టంతో స‌భ‌ను వాయిదా వేస్తూ స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకున్నారు. శ‌ని.. ఆదివారం.. సోమ‌వారం రామ‌న‌వ‌మి సంద‌ర్భంగా సభ మంగ‌ళ‌వారానికి వాయిదా వేశారు.

ఇదిలా ఉంటే.. స్పీక‌ర్ ను క‌లిసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్ర‌య‌త్నించ‌గా ఆమె క‌లిసేందుకు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌టంపై ఆ పార్టీ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌భ‌లో గంద‌ర‌గోళం జ‌రుగుతున్నా.. దాన్ని స‌ర్దే ప్ర‌య‌త్నం చేయ‌లేద‌ని ఆరోపించారు. త‌మ ఎంపీలు స్పీక‌ర్ ను క‌లిసే ప్ర‌య‌త్నం చేయ‌గా.. అందుకు నో చెప్ప‌టంపై ప‌లువురు వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు.. అభిమానులు త‌మ ఎంపీల‌కు అవ‌మానం జ‌రిగిన‌ట్లుగా సోష‌ల్ మీడియాలో వాపోతున్నారు. జ‌గ‌న్ పార్టీ ఎంపీలు స‌భ మొద‌లైన త‌ర్వాత త‌మ స్థానాల్లో మౌనంగా కూర్చున్నార‌ని.. గ‌డిచిన ఆరు రోజులుగా అవిశ్వాస తీర్మానం పెడుతూనే ఉన్నామ‌ని.. కానీ చ‌ర్చకు రానివ్వ‌టం లేద‌న్నారు. ప్ర‌జాస్వామ్యంపై ఏ మాత్రం గౌర‌వం ఉన్నా.. స‌భ‌ను చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నాన్ని స్పీక‌ర్ చేస్తే బాగుండేద‌న్నారు.