Begin typing your search above and press return to search.

సాక్షి లాభాలెంతో లెక్క తేల్చిన లోకేశ్ !

By:  Tupaki Desk   |   5 July 2022 5:56 AM GMT
సాక్షి లాభాలెంతో లెక్క తేల్చిన లోకేశ్ !
X
"జగన్ రెడ్డి అవినీతికి ఇదే నిదర్శనం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన అవినీతి పత్రిక సాక్షిని బాగా మేపుతున్నారు. జగన్ .. ప్రతిపక్షంలో ఉండగా నష్టాల్లో ఉన్న జగతి పబ్లికేషన్స్, పార్టీ అధికారంలోకి రాగానే లాభాల్లో దూసుకుపోతోంది అంటే అర్థం ఏంటి? " అంటూ విప‌క్ష నేత నారా లోకేశ్ ప్ర‌శ్నిస్తున్నారు. ఇంత‌కూ ఏం జ‌రిగింది ఓ సారి చూద్దాం.

రెండ‌క్ష‌రాల సాక్షి పేప‌ర్ అప్పుడెప్పుడో వైఎస్ హ‌యాంలో పెట్టారు. 2008, మార్చి23న ప్రారంభించారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టిదాకా కొంత లాభాల‌తోనూ, కొంత న‌ష్టాల‌తోనూ న‌డుస్తోంది.

మొద‌ట్లో నెల‌కు కోటి రూపాయ‌ల న‌ష్టంతో న‌డిచేది అని అనేవారు. కానీ త‌రువాత ఆ న‌ష్టాల సంఖ్య పెరిగిందే కానీ త‌మ‌కు లాభాలు అంటూ ఏమీ రావ‌డం లేద‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనేవారు.

సొంత మ‌నుషులు కూడా ఇదే విధంగా వ్యాఖ్యానించేవారు. ఇప్పుడు ప్ర‌భుత్వం వైసీపీది. క‌నుక ఉన్న‌ట్లుండి మార్కెట్లో మంచి లాభాలే అందుకుంది. అదేవిధంగా వ‌లంటీర్లు కూడా పేప‌ర్ కొనుగోలు చేసేవిధంగా నెల‌కు 200 రూపాయ‌లు చెల్లిస్తామ‌ని చెబుతుండ‌డంతో పేప‌ర్ స‌ర్క్యులేష‌న్ మ‌రో 2.66 ల‌క్షల‌కు పెర‌గ‌నుంది కూడా! ఏ విధంగా చూసుకున్న అన్ని పేజీలూ రంగుల్లో అంటూ ఊద‌ర‌గొట్టిన సాక్షికి ఇప్పుడు కాసుల పంట పండుతోంది.

ఇక లోకేశ్ చెప్పిన లెక్క‌ల ప్ర‌కారం 2017 -18 సంవ‌త్స‌రానికి న‌ష్టం మూడు కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఉంది. 2018 -19 ఏడాదికి న‌ష్టం ఏడు కోట్ల రూపాయ‌లకు పైగా ఉంది. కానీ ఇప్పుడు 2019లో అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఈ రెండేళ్ల‌లో సాక్షి ఆర్థిక పునాదులు బాగా బ‌ల‌ప‌డ్డాయి. 84.48 కోట్ల రూపాయ‌ల లాభాల‌తో ఇప్పుడీ సంస్థ దూసుకుపోతోంది.

ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌నలే కాదు కార్పొరేట్ శ‌క్తుల ప్రోద్బ‌లం కూడా ప్ర‌క‌ట‌న‌ల రూపంలో ఉండ‌డంతో సాక్షికి ఇప్పుడు న‌ష్టాల ఊసే లేదు. అంతేకాకుండా తాజా ఉత్త‌ర్వుల ప్ర‌కారం వ‌లంటీర్ల‌కు నెలకు 200 రూపాయ‌లు చెల్లిస్తే ఏడాదికి 63.84 కోట్ల రూపాయ‌లు సాక్షి ఖ‌జానాకు చేరిపోవ‌డం ఖాయం. అంటే వ‌స్తున్న కాలానికి సాక్షి లాభాలు ఇంకాస్త పెర‌గ‌నున్నాయి అన్న‌ది లోకేష్ వివరణ.