Begin typing your search above and press return to search.

లోకేష్ కోరుకున్న‌దే.. జ‌గ‌న్ చేస్తున్నారా..?

By:  Tupaki Desk   |   21 Aug 2021 10:30 AM GMT
లోకేష్ కోరుకున్న‌దే.. జ‌గ‌న్ చేస్తున్నారా..?
X
టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోక‌ష్ కోరుకున్న‌దే ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ చేస్తున్నారా ? త‌న వ్యూహానికి త‌గిన విధంగా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అంటే.. అవుననే అంటున్నారు ప‌రిశీల‌కు లు. గ‌డిచిన నెల‌ రోజులుగా ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను చూస్తే.. లోకేష్ గ్రాఫ్ పుంజుకుంది. అయితే.. ఇది త‌నంత‌ట త‌ను పెంచుకున్న గ్రాఫ్ కాదు! కేవ‌లం జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరుతో లోకేష్ గ్రాఫ్ పెరిగిం ద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ముఖ్యంగా గ‌డిచిన రెండేళ్లుగా టీడీపీ పుంజుకునేందుకు, వ్య‌క్తిగ‌తంగా తాను లీడ్‌లోకి వ‌చ్చేందుకు లోకేష్ ప్ర‌య‌త్నించారు.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు లోకేష్ గ్రాఫ్‌.. పైకి కింద‌కి అన్న‌ట్టుగా ప‌ల్టీలు కొడుతోంది. దీంతో లోకేష్ పుంజుకుం టారో ? లేదో అనే సందేహాలు సొంత పార్టీలోనే వినిపించాయి. కొంద‌రైతే... ఇక‌, లోకేష్ పుంజుకోవ‌డం క‌ష్ట‌మ‌నే వాద‌న‌ను కూడా తెర‌మీదికి తేవ‌డంతో పాటు పార్టీ బ‌త‌కాలంటే జూనియ‌ర్ ఎన్టీఆర్ రావాల‌స్సిందే అని కూడా చ‌ర్చించారు. అయితే.. అనూహ్యంగా గుంటూరులో జ‌రిగిన విద్యార్థిని ర‌మ్య హ‌త్య కేసు లోకేష్‌కు బాగానే క‌లిసి వ‌చ్చింది. ఈ విష‌యంలో ఆయ‌న దూకుడు చూపించారు. ఒక ర‌కంగా.. ఆయ‌న ఈ ఘ‌ట‌న త‌ర్వాత‌.. గ్రాఫ్ పెంచుకున్నార‌నే చెప్పాలి.

లోకేష్ హ‌త్య జ‌రిగిన వెంట‌నే ర‌మ్య‌ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌డం.. ఈ క్ర‌మంలో పార్టీ నేత‌ల‌ను సంఘ‌టితం చేయ‌డం వంటివి లోకేష్‌కు బాగానే క‌లిసివ‌చ్చాయి. అయితే. ఈ స‌మ‌యంలో జ‌గ‌న్ స‌ర్కారు వ్య‌వహ‌రించిన తీరు.. లోకేష్‌కు మ‌రింత‌గా క‌లిసి వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని ర‌కాలుగా నిర‌స‌న‌లు వ్య‌క్తం చేసినా.. ఆందోళ‌న‌ల్లో పాల్గొన్నా.. లోకేష్‌పై పోలీసులు కేసులు న‌మోదు చేయ‌లేదు. దీంతో లోకేష్ కేసుల‌కు భ‌య‌ప‌డుతున్నార‌ని.. వైసీపీ నాయ‌కులు వ్యాఖ్యానించారు. ఇది ఒక‌ర‌కంగా.. టీడీపీలోనూ మైన‌స్ అయింది.

ప్ర‌జా నాయ‌కుడిగా ఉన్న‌వారు.. కేసుల‌కు వెర‌వ‌డం ఎందుకు ? అనే చ‌ర్చ కూడా వ‌చ్చింది. అయితే.. లోకేష్ దీనిని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కానీ.. తాజాగా ర‌మ్య ఘ‌ట‌న‌లో పోలీసులు కేసులు న‌మోదు చేశారు. అంతేకాదు.. లోకేష్‌ను అరెస్టు కూడా చేసి.. బ‌ల‌వంతంగా వ్యాన్‌లోకి ఎక్కించ‌డంతో.. ఇది టీడీపీకి వ‌రంగా క‌లిసి వ‌చ్చింది. పోలీసులు కూడా 11 కేసులు న‌మోదు చేయ‌డం.. స్టేష‌న్ బెయిల్ ఇవ్వ‌డం.. వంటివి అటు లోకేష్‌కు, ఇటు టీడీపీకి బాగానే క‌లిసి వ‌చ్చాయ‌ని చ‌ర్చ న‌డుస్తోంది. లోకేష్ విష‌యంలో జ‌గ‌న్ / జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరు.. ఈ స‌మ‌యంలో గ్రాఫ్ పెంచుకునేందుకు ఉపయోగ‌ప‌డింద‌నే చెప్పాలి.