Begin typing your search above and press return to search.
కేటీఆర్ లా కావాలనుకుంటున్న లోకేశ్
By: Tupaki Desk | 15 Jan 2016 11:30 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కుమారుడు కె. తారకరామారావు కీలకమైన ఐటీ, పంచాయితీరాజ్ శాఖలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో జరిగిన ప్రతి కార్యక్రమంలో ఆయన కీలకపాత్ర పోషిస్తున్నారు. పత్రికలు, ప్రసార సాధనాలు కూడా ఆయనకు ప్రాధాన్యతనిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌లో కూడా ఆయన కీలకనేతగా ఎదిగారు. మరోవైపు ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైనా ఆ స్థాయిలో ప్రచారం రావడం లేదు. ఇప్పటికీ పార్టీ నేతలు ఆయన్ను తెరవెనుక నేతగానే చూస్తున్నారు. దీంతో ఆయన తాను కూడా కేటీఆర్ స్థాయిలో ప్రాచుర్యం పొందాలని లోకేశ్ తలపోస్తున్నారు. ఆ క్రమంలోనే కేంద్ర మంత్రివర్గంలో అడుగుపెట్టి సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఇందుకోసం ఇప్పటికే తన సన్నహిత మిత్రడు అభీష్టను జాతీయ స్థాయిలో తన తరఫున ప్రచారానికి లోకేశ్ ఏర్పాటు చేసుకున్నారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రజలు కూడా నారా లోకేష్, కేటీఆర్‌లను పోల్చి చూసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాగైనా కేటీఆర్‌లా పేరు తెచ్చుకోవాలనే ఆలోచనతో ఉన్న లోకేష్ ఏవిధంగా తెరముందు కీలకపాత్ర పోషిస్తే బాగుంటుందని గత కొద్ది రోజులుగా సన్నిహితులతో చర్చిస్తున్నారు. ఆందుకు కేంద్ర మంత్రి పదవే మంచి మార్గమన్నది ఆయన ఆలోచన. దానికోసం ఇప్పుడాయన రాజ్యసభ పదవిపై కన్నేశారు. ఇందుకు చంద్రబాబు ఆమోదం పడినట్లుగా కూడా సమాచారం. అన్నీ కలిసొస్తే ఈ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కూడా జాతీయ రాజకీయాల్లో హడావుడి చేసే రోజు ఇంకెంతో కాలం లేదు.