Begin typing your search above and press return to search.

లోకేష్‌ కు నచ్చని పని చేస్తే అంతే కదా మరి

By:  Tupaki Desk   |   18 Aug 2015 6:53 AM GMT
లోకేష్‌ కు నచ్చని పని చేస్తే అంతే కదా మరి
X
ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, చిన్న‌సార్ లోకేష్‌ కు కోపం వ‌చ్చింది. ఏపీ ప్ర‌భుత్వంలో ఏడాదికి పైగా ప్రొటోకాల్ శాఖ‌, స‌మాచార శాఖ‌ల్లో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న ఎన్‌వి.ర‌మ‌ణారెడ్డి ని ఆ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించ‌డంలో లోకేష్ పాత్ర ఉన్న‌ట్టు స‌మాచారం. జాతీయ మీడియా క‌థ‌నాల ప్ర‌కారం కొద్ది రోజుల క్రితం వైకాపా అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి ఢిల్లీలో ధ‌ర్నా చేసిన‌ప్పుడు ర‌మ‌ణారెడ్డి వైకాపా ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ ల‌కు ఏపీ భ‌వ‌న్‌ లో గ‌దులు కేటాయించార‌ట‌.

ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యే ల‌కు, ఎమ్మెల్సీ ల‌కు రాజ‌ధానిలో రాజ‌మ‌ర్యాద‌లు చేయ‌డం ఏంట‌ని ఆగ్ర‌హంతో ఉన్న లోకేష్ ర‌మ‌ణారెడ్డిని ఆ ప‌ద‌వినుంచి త‌ప్పించ‌డంలో కీల‌క‌పాత్ర పోషించార‌ని టాక్‌. గ‌తంలో వైఎస్ సీఎంగా ఉండ‌గా ర‌మ‌ణారెడ్డి హ‌వా కొన‌సాగేది. టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక కూడా ఆయ‌న కీల‌కంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజా సంఘ‌ట‌న‌తో ఆయ‌న వ్య‌వ‌హార శైలీ లోకేష్‌ కు చిర్రెత్తుకొచ్చేలా చేసింద‌ని... ఈ విష‌యాన్ని ఢిల్లీలో ఉన్న కొంద‌రు టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధులు ఆయ‌న దృష్టికి తీసుకురావ‌డంతో లోకేష్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం.

అయితే మ‌రికొంద‌రి స‌మాచారం ప్ర‌కారం ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యే ల‌కు కూడా ఏపీ భ‌వ‌న్‌ లో గ‌దులు పొందే అర్హ‌త ఉంటుద‌ని..ఈ వ్య‌వ‌హారాల‌న్ని అక్క‌డ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ చూస్తార‌ని అంటున్నారు. ఐఆర్ ఎస్ అధికారి అయిన ర‌మ‌ణారెడ్డి ఉమ్మ‌డి రాష్ర్టంలో ఇక్క‌డ విధులు నిర్వ‌హించేందుకు వ‌చ్చారు. ఆయ‌న కాల‌ప‌రిమితి ముగిసినందును రైల్వే శాఖ ఆయ‌న డిప్యుటేష‌న్ పొడిగించ‌లేద‌ని పైకి చెపుతున్నా అస‌లు క‌థ లోకేష్‌ కు కోపం రావ‌డ‌మే అని అంటున్నారు. దీంతో ఆయ‌న్ను మాతృశాఖ‌కు పంపేందుకు రంగం సిద్ధ‌మైంది.