Begin typing your search above and press return to search.
వైసీపీ నేతల ఆడియో లీకుల వెనుక లోకేష్ హస్తం?
By: Tupaki Desk | 21 Aug 2021 2:30 PM GMTవైసీపీ నేతలు, మంత్రి ఆడియో లీకులు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఈ ఆడియో లీక్ ఎపిసోడ్‌లపై తీవ్రంగా స్పందించారు. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉన్నారని విమర్శించారు. ఇది ఉద్దేశపూర్వకంగా వైసీపీ పరువు తీసేందుకు చేస్తున్నారని మండిపడ్డారు.
"వైసీపీ నాయకులు.. మంత్రుల ఆడియో క్లిప్పింగ్‌ల కోసం కుట్ర చేస్తున్నారని.. డబ్బింగ్.. మిమిక్రీ కళాకారుల సహాయంతో ఇలా ఫేక్ ఆడియోలు సృష్టిస్తున్నారు,. దుర్వినియోగం చేస్తున్నారు. ఈ క్లిప్‌లకు అదనపు స్టేట్‌మెంట్‌లు జోడించబడ్డాయి.. అవి టిడిపి ద్వారా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయబడుతున్నాయి, " అని అళ్ల ఆరోపించారు.
"అన్ని విధాలుగా వైసీపీని పరువు తీసేందుకు, లోకేష్ 100 మందికి పైగా దీనికోసం నియమించుకున్నారని.. వారికి ఆరు అంకెల జీతం చెల్లిస్తున్నారు. లోకేష్ రాజకీయాలలో ఇంత తక్కువ స్థాయికి దిగజారిపోతాడని ఊహించలేదు' అని ఆళ్ల రామకృష్ణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ టీడీపీ ఛానెల్‌లలో ఈ ఆడియో క్లిప్పింగ్‌లను ప్రసారం చేస్తున్నారని అళ్ల మీడియాకు వివరించారు. "ఇటువంటి సంఘటనలు నివేదించబడినప్పుడు, మీడియా వాస్తవాలను ధృవీకరించాలి. ప్రమేయం ఉన్న నాయకుడిని సంప్రదించాలి. సరైన గ్రౌండ్ వర్క్ చేయకుండా, సంచలనం కోసం ఈ వార్తలను ప్రసారం చేయడం మీడియాలో కొంతవరకు అనైతికం "అని మంగళగిరి ఎమ్మెల్యే అన్నారు.
ఇటీవల సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆడియో క్లిప్ ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. అప్పటి నుండి అంబటి మీడియాకు దూరంగా ఉంటున్నారు. టీడీపీ మాత్రం అతడిని దారుణంగా టార్గెట్ చేస్తోంది. దీంతో ఈ ఆరోపణలను ఆళ్ల రామకృష్ణారెడ్డి ఖండించారు.